2022లో రాబోయే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ మెగా వేలానికి ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎవ‌రినీ రిటైన్ చేసుకుంటుంద‌నే విష‌యంపై ఉత్కంఠ నెల‌కొన్న‌ది. అయితే ఆర్‌సీబీ ఎవ‌రినీ ఉంచుకోనుందో అని భార‌త మాజీ ఆట‌గాడు ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ముఖ్యంగా ఫ్రాంచైజీ మాజీ
కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుందని భావిస్తున్నట్టు వివ‌రించారు.

అయితే మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్‌లలో ఎవరినైనా ఎంచుకోవడంలో మేనేజ్‌మెంట్ డైలమాలో ప‌డ‌వ‌చ్చ‌ని  తన యూట్యూబ్ ఛానెల్‎లో చోప్రా  వెల్ల‌డించాడు. విరాట్ కోహ్లీ, యూజీ చాహల్, మరో ఇద్దరు నా చేతిలో ఉంటే, నేను మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్‌ను ఉంచడానికి ప్రయత్నిస్తాను,  వీరే నా నలుగురు ఆటగాళ్లు అని చోప్రా పేర్కొన్నాడు.

ఆర్‌సీబీ జ‌ట్టు యాజ‌మాన్యం విరాట్‌ కోహ్లి, యుజువేంద్ర చాహల్, మహమ్మద్‌ సిరాజ్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌లను రిటెయిన్‌ చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు. అయితే జట్టు భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా చూస్తే మహమ్మద్‌ సిరాజ్‌ను ప్రస్తుత ఫామ్‌ ప్రకారం చూస్తే హర్షల్ పటేల్‌ను తీసుకునే అవకాశం  క‌నిపిస్తుంద‌ని  చెప్పాడు. సిరాజ్, హర్షల్‌ల మధ్య ఎంపిక చేసుకునేటప్పుడు మేనేజ్‌మెంట్ వారి విజన్‌ని చూడాల్సి  ఉంటుందని చెప్పారు. మీరు సిరాజ్‌ను దీర్ఘకాల దృష్టిలో చూడ‌వ‌చ్చ‌ని.. కానీ గత 12 నెలలుగా హర్షల్  అద్భుతుంగా ఆడుతున్నాడు అని చోప్రా వివ‌రించాడు.

ఆకాశ్ చోప్రా త‌న జాబితా నుంచి  గ‌త సీజ‌న్‌లో ఆర్‌సీబీ త‌రుపున ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన  ఆస్ట్రేలియా ఆల్ రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను మాత్రం మిన‌హాయించాడు. మాక్స్‌వెల్ రిటైన్ చేసుకోక‌పోవ‌చ్చ‌ని చెప్పుకొచ్చాడు. మాక్స్‌వెల్‌పై వంద శాతం న‌మ్మ‌కం లేక‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం అని వివ‌రించాడు. మాక్సి బాగానే ఆడుతున్నాడ‌ని.. కానీ అత‌ను దానిని అలాగే కొన‌సాగిస్తాడా లేదా అనేది క‌చ్చితంగా చెప్ప‌లేము అని చోప్రా చ‌మ‌త్క‌రించాడు. అయితే ఐపీఎల్ 2021 స‌మ‌యంలో ఆర్‌సీబీ జ‌ట్టు ప‌ట్టిక‌లో మూడోస్థానంలో నిలిచింది. ప్లేఆప్‌ల‌కు అర్హ‌త సాధించినా.. ఎలిమినేట‌ర్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో ప‌రాజ‌యం పాలై బెంగ‌ళూరు జ‌ట్టు ప్లే ఆప్ నుంచి నిష్క్ర‌మించిన‌ది.  


మరింత సమాచారం తెలుసుకోండి: