కాన్పూర్ స్టేడియంలో భారత్ జట్టుకు మెరుగైన రికార్డు ఉంది. ఈ స్టేడియంలో 1952లో భారత్ - ఇంగ్లండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ ఓడింది. 1983లో ప్రపంచ కప్ టోర్నీకి ముందు వెస్టిండీస్ జట్టుతో టీమిండియా కాన్పూర్ స్టేడియంలో టెస్ట్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో విండీస్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత నుంచి... ఇప్పటి వరకు కాన్పూర్ గ్రీన్ పార్క్ స్టేడియంలో భారత జట్టు ఓడింది లేదు. అయితే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ జట్టు చేతిలో ఓడిన టిమిండియా... అందుకు బదులు తీర్చుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో టీ 20 సిరీస్ ఓడిన కేన్ విలియమ్సన్ జట్టు కూడా కాన్పూర్ టెస్టులో గెలిచి... తామేమిటో భారత్‌కు రుచి చూపించాలని భావిస్తోంది. దీంతో 38 ఏళ్లుగా భారత్ పేరుతో ఉన్న విన్నింగ్ రికార్డును టీమిండియా నిలుపుకుంటుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తొలి రెండు రోజుల్లో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని... ఆ తర్వాత స్పిన్ వైపు తిరుగుతుందని పిచ్ క్యూరేటర్ వెల్లడించారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు భారీ స్కోరు సాధించే అవకాశం ఉందన్నారు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం మేలని కూడా సూచించారు.