సాధారణంగానే ఐపీఎల్ ఎంతో రసవత్తరంగా సాగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ కొత్తగా రెండు జట్లు  రావడంతో ఐపీఎల్ 15వ సీజన్ పోరు మరింత రసవత్తరంగా మారబోతుంది. అయితే ఇక ప్రస్తుతం ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్లకు కెప్టెన్గా ఎవరు మారబోతున్నారు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అంతేకాదు మొన్నటి వరకు వివిధ జట్లకు ఉన్న కెప్టెన్లు కూడా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఏ జట్టు ఎవరిని రిటైన్ చేసుకోబోతోంది అన్న విషయం పై ఇటీవల నివేదిక సమర్పించాలి అంటూ బిసిసిఐ కోరింది  దీంతో ఏ జట్టు ఏ ఆటగాడిని రిటైన్ చేసుకుంటుంది కొత్త జట్లకు కెప్టెన్గా ఎవరు వ్యవహరించ పోతున్నారు అన్నది  కూడా హాట్ టాపిక్ గా మారింది.


 ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. మొన్నటి వరకు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగాడు కె.ఎల్.రాహుల్. ఇక జట్టును విజయతీరాలకు వైపు నడిపించేందుకు ఒంటిచేత్తో పోరాటం చేశాడు. ప్రస్తుతం టి 20 క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్నాడు. కాగా ప్రస్తుతం కేఎల్ రాహుల్ పంజాబ్ జట్టు నుండి లక్నో జట్టులోకి వెళ్ళిపోతున్నాడు అన్నది అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల కేఎల్ రాహుల్ తో లక్నో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధం అవుతోందట. ఇక కొత్తగా ఐపీఎల్ లో కి  ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టుకి  మూడు సీజన్ల పాటు కె.ఎల్.రాహుల్ కెప్టెన్గా వ్యవహరించ పోతున్నట్లు తెలుస్తోంది.


 అయితే ఇటీవలే కె.ఎల్.రాహుల్ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. దీంతో ఇక రాహుల్ పంజాబ్ నుంచి ముంబై ఇండియన్స్ కు వెళ్లిపోతున్నాడు అంటూ ఊహాగానాలు కూడా వినిపించాయి. ఒకవేళ పంజాబ్ జట్టు అతని వదులుకుంటే వేలం లోకి వదిలేస్తే మాత్రం ఇక అతనికి భారీ డిమాండ్ వుంటుంది అనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అటు ఇటు కె.ఎల్.రాహుల్ ను దక్కించుకునేందుకు ఎంత చెల్లించడానికైనా లక్నో ఫ్రాంచైజీ  సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీ వర్గాలు కూడా కేఎల్ రాహుల్ తో సంప్రదింపులు జరుపగా అతడు కూడా సానుకూలంగానే ఉన్నాడట. చూడాలి మరి నిజంగానే కె.ఎల్.రాహుల్ లోక్నో కెప్టెన్గా మారబోతున్నాడా అన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kl