టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు అజింక్యా రహానే. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం టీమిండియా తరఫున వరుసగా టెస్టు ఆడుతున్న అజింక్యా రహానే బ్యాటింగ్ పూర్తిగా విఫలం అవుతున్నాడు. అయినప్పటికీ  అటు టీమిండియా మాత్రం అజింక్య రహానే కి  టెస్టు జట్టులో అవకాశం కల్పిస్తూ వస్తుంది. అంతే కాదు రెగ్యులర్ కెప్టెన్ లేని సమయంలో ఇక టీమిండియాకు కెప్టెన్గా కూడా బాధ్యతలు అప్ప చెప్తుంది. కోహ్లీ రెగ్యులర్ కెప్టెన్ ఉంటే ఇక టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు అజింక్యా రహానే. ఇలా బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ బిసిసిఐ మాత్రం అవకాశాలు ఇస్తూనే వస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో ఇటీవలే అజింక్యా రహానే సారథ్యంలో న్యూజిలాండ్ జట్టుతో మొదటి మ్యాచ్ ఆడుతుంది భారత జట్టు. అయితే ఇక మొదటి టెస్ట్ మ్యాచ్లో అజింక్యా రహనే భారీగా పరుగులు చేస్తాడు అని అనుకున్నారు అందరు. అయితే 35 పరుగులతో అజింక్యా రహానే దూకుడుగా కనిపించడంతో ఇక సెంచరీ చేయడం పక్క అని నమ్మకం పెట్టుకున్నారు. కానీ అంతలోనే తాను బాగా ఆడుతున్నాను అని ఫీల్ అయ్యాడో ఏమో వెంటనే వికెట్ సమర్పించుకున్నాడు అజింక్యా రహానే. 35 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుతిరిగాడు. దీంతో అజింక్య రహానే   ప్రదర్శనపై ప్రస్తుతం అభిమానులు ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ గా ఎంతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడకుండా నిర్లక్ష్యంగా వికెట్ ఇచ్చుకోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా అవకాశం వచ్చినప్పటికీ బ్యాట్మెన్గా అజింక్య రహానే మరోసారి విఫలమయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం అజింక్య రహానే పేలవ ప్రదర్శన పై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. కెప్టెన్ అయి బతికిపోయాం లేకుంటే ఎప్పుడో  పక్కన పెట్టే వారు అంటూ ఎంతో మంది టీమిండియా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తర్వాతి మ్యాచ్ లో అజింక్య రహానే జట్టులో ఉండడం కష్టమే అనీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. పెద్ద స్కోర్ చేస్తాడు అన్న ప్రతీసారి వికెట్ ఇచ్చేస్తూ  ఉంటాడు అంటూ ఇంకొంతమంది టీమిండియా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: