జనవరి 2022 లో మెగా వేలానికి ముందు, డిఫెండింగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మూడు సీజన్ల లో తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ధోనీ తో పాటు, చెన్నై 2021 ఐపీఎల్ టైటిల్ విజయం లో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరియు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ లను ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకుంటుంది అని తెలుస్తుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ప్రతి జట్టు గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను ఉంచుకోవడానికి అనుమతించబడుతుంది. అయితే ఈ నాలుగురు ఛాంపియన్‌ ల బోర్డులోకి రావడానికి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ తో చర్చలు జరుపుతున్నారు.

చెన్నై లోని చెపాక్ స్టేడియంలో స్లో అండ్ టర్నింగ్ ట్రాక్‌ లో మొయిన్ అలీ ఉపయోగకరమైన ఆటగాడు కావచ్చు. అయితే, అతను ఉండడానికి అంగీకరించకపోతే, చెన్నై తన నాల్గవ ఆటగాడిగా మరొక ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కర్రన్‌ ను నిలుపుకుంటుందని సమాచారం. అయితే అంతకుముందు, ధోనీ తన చివరి టీ 20 మ్యాచ్ చెన్నై లో ఉంటుందని స్వయంగా ధృవీకరించాడు. “నేను ఎప్పుడూ నా క్రికెట్‌ ను ప్లాన్ చేసుకుంటాను. భారత్‌ లో నా చివరి వన్డే రాంచీలో జరిగింది. నా చివరి టీ20 ఐపీఎల్ మ్యాచ్ చెన్నై లో జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇది వచ్చే ఏడాది లేదా ఐదేళ్లలో నాకు తెలియదు”అని ఇటీవల ఓ ఈవెంట్‌లో ధోని చెప్పాడు. ముఖ్యంగా, ఫ్రాంచైజీలు నవంబర్ 30 లోపు తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాలను సమర్పించాలి మరియు ఆ తర్వాత 2022 సీజన్ నుండి లీగ్‌లో చేరిన రెండు కొత్త జట్లతో మెగా వేలం ఉంటుంది. చూడాలి మరి ఏ జట్టు ఏ ఏ ఆటగాడిని తమ వెంట ఉంచుకుంటుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: