హార్దిక్ పాండ్యా బ్రదర్ గా టీమ్ ఇండియా టి-20 ఫార్మెట్లోనూ నిలకడగల ఆటగాడిగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు కృనాల్ పాండ్యా. అప్పుడప్పుడు ఆల్రౌండ్ ప్రదర్శన తోఅదరగొడుతు ఉంటాడు కృనాల్ పాండ్యా.అయితే కేవలం అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు దేశవాళీ క్రికెట్లో కూడా తన సత్తా చాటుతూ అదరగొడుతున్నాడు. అయితే బిసిసిఐ ప్రతి ఏడాది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీలో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అదర కొడుతూ ఉంటారు. మరోవైపు అటు అంతర్జాతీయ జట్టులో రాణించిన ఆటగాళ్లు సైతం ఆడుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే మొన్నటి వరకు టీమిండియా లో ఆడిన కృనాల్ పాండ్యా కూడా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ఒక జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం బరోడా టీం కెప్టెన్ గా కొనసాగుతున్నాడు కృనాల్. ఇప్పటివరకూ తన కెప్టెన్సీని తో పలుమార్లు అదరగొట్టాడు. బరోడా టీం కి అరుదైన విజయాలు కూడా అందించాడు. అయితే గతంలో యువ క్రికెటర్ తో కృనాల్ పాండ్యా కు వివాదం కూడా ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ జరిగింది. ఇక ఈ టోర్నీలో కృనాల్ పాండ్యా కెప్టెన్గా పూర్తిగా విఫలం అయ్యాడు.




 దీంతో ఇటీవలే దీనికి బాధ్యత వహిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు కృనాల్ పాండ్యా. బరోడా టీంకి కెప్టెన్సీకి కృనాల్ పాండ్య గుడ్ బాయ్ చెప్పేసాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో తన జట్టు విఫలం అవడంతో బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ  నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు.  ప్రస్తుతం బరోడా టీం విజయ్ హజారే ట్రోఫీ లో ఆడుతుంది. దీంతో కృనాల్ పాండ్యా స్థానంలో బరోడా టీం కి కొత్త కెప్టెన్గా దేవదర్ వ్యవహరించ బోతున్నాడు అన్నది అర్ధమవుతుంది. ఈ క్రమంలోనే కొత్తకెప్టెన్ సారథ్యంలో అటు బరోడా టీం ఎలా రాణిస్తుంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: