న్యూజిలాండ్ ఇండియా టూర్ లో భాగంగా 3 టీ 20 లు మరియు 2 టెస్ట్ లు ఆడనుంది. టీ 20 సిరీస్ ను కోల్పోయిన కివీస్ టెస్ట్ సిరీస్ అయినా గెలవాలని కసిగా ఆడుతోంది. అందులో భాగంగా కాన్పూర్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇరు జట్లు మొదటి ఇన్నింగ్స్ ను పూర్తి చేసుకున్నాయి. కివీస్ తన మొదటి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆల్ ఔట్ అయింది. ఇండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 5 మరియు రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 49 పరుగుల స్వల్ప ఆధిక్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా రెండవ ఓవర్ లోనే శుబ్ మాన్ గిల్ వికెట్ ను కోల్పోయింది.

అలా మరో వికెట్ పడకుండా 3 వ రోజు ముగిసింది. మరో రెండు రోజులు మిగిలి ఉండగా గెలుపు కోసం రెండు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు మొదటి సెషన్ లో ఇండియా వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడితే తర్వాత పరుగులు సాధించవచ్చు.  ముఖ్యంగా కైల్ జేమీసన్ మరియు స్పిన్నర్ లను సమర్దవంతంగా ఎదుర్కోవాలి. ఈ రోజు మొత్తం ఇండియా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే కివీస్ ముందు మంచి లక్ష్యాన్ని ఉంచవచ్చు. అయితే ఈ రోజు సెకండ్ ఇన్నింగ్స్ లో రహానే మరియు పుజారా నిలకడగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది.

మొదటి ఇన్నింగ్స్ లో విఫలం అయిన మయాంక్ కనీసం అర్థ సెంచరీ సాధించి తన ఎంపికకు న్యాయం చేసుకోవాలి. శ్రేయస్ అయ్యర్ మొదటి ఇన్నింగ్స్ లో లాగా మరో చక్కని ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. మరి ఇండియా అవసరమైన పరుగులు సాధించి కివీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచగలదా? లేదా కివీస్ బౌలర్ల ధాటికి తల వంచుతుందా అన్నది తెలియాలంటే ఇంకాస్త సమయం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: