ఇటీవల టి20 వరల్డ్ కప్ రన్నరప్  గా నిలిచిన న్యూజిలాండ్ జట్టు అటు వెంటనే భారత పర్యటనకు వచ్చింది. భారత పర్యటనలో భాగంగా ఇప్పటికే టి20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే. అయితే టి20 సిరీస్ లో ఓటమి పాలయింది న్యూజిలాండ్ జట్టు. ప్రస్తుతం టీమిండియాతో భారత్ వేదికగా టెస్ట్ సిరీస్ ఆడుతూ  ఉండటం గమనార్హం. ఇప్పటికే టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ముగిసింది.. మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు గెలుస్తుందనే అందరు భావించినప్పటికీ చివరి మ్యాచ్ డ్రాగా ముగిసింది. మ్యాచ్ డ్రాగా ముగియడం మాత్రం అటు టీమిండియాకు పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పాలి. మ్యాచ్ డ్రాగా ముగియడం కారణంగా అటు వరల్డ్ బెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో అగ్ర స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకుంది టీమిండియా. ఇక రానున్న రోజుల్లో టీమిండియా మొదటి స్థానం లోకి వెళ్లాలి అంటే రెండో టెస్ట్ లో తప్పని సరిగా గెలవాల్సి ఉంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్లో కెప్టెన్ గా వ్యవహరించాడు అజింక్యా రహానే. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేకపోవడంతో అజింక్యా రహానే కెప్టెన్సీలోని మొదటి టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా. కానీ రెండో టెస్టు మ్యాచ్ లో మాత్రం రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ రాబోతున్నాడు అనే విషయం తెలిసిందే.


 అయితే రెండవ టెస్ట్ మ్యాచ్లో మెడ కండరాలు పట్టేయడం తో వృద్ధిమాన్ సాహా మైదానాన్ని వదిలి వెళ్లిపోయాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అతని స్థానంలో తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ జట్టులోకి ఎంట్రీ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. ఇక తన ప్రతిభను చాటుకునేందుకు మంచి అవకాశం వచ్చింది అనుకున్నారు. అయితే టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడు అనుకున్న తెలుగు క్రికెటర్ శ్రీకర్ భారత్ కు నిరాశ ఎదురైంది. తొలి టెస్టులో మెడ కండరాలు పట్టేయడం తో రెస్ట్ తీసుకున్న వృద్ధిమాన్ సాహా ప్రస్తుతం మళ్లీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది. ఇటీవలే ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లి ప్రకటించాడు. దీంతో అతని రెండవ టెస్ట్ వికెట్ కీపింగ్ చేసే ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. దీంతో టీమిండియా లో సెలెక్ట్ అయిన శ్రీకర్ భరత్ కు నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: