ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో సిరీస్ ఆడుతుంది టీమిండియా. అయితే టెస్ట్ సిరీస్లో భాగంగా ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. ఇక రెండవ టెస్ట్ మ్యాచ్ జరగబోతోంది.. ఇక ఈ టెస్ట్ సిరీస్ ముగియగానే ఆ తరువాత దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేర పోతుంది టీమిండియా. దక్షిణాఫ్రికా జట్టుతో మూడు టెస్టులు మూడు వన్డేలు నాలుగు టి20 మ్యాచ్ లు ఆడబోతుంది. ఈ క్రమంలోనే ఇక డిసెంబర్ 9నా టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ఉంటుందా లేదా అన్న దానిపై అనుమానాలు నెలకొన్నాయి.



 ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరిలో కూడా కొత్త చర్చ మొదలయ్యింది. దక్షిణాఫ్రికాలో టీమిండియా ఆడబోయే వన్డే జట్టుకు కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు అన్న చర్చ మొదలయింది. ఎందుకంటే ఇటీవలే టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ.దీంతో టీ20 టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ నియమించారు. ఇకపోతే ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. మరి వన్డే జట్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగుతారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. పరిమిత ఓవర్ల క్రికెట్ కి అటు రోహిత్ శర్మ కెప్టెన్సీ గా ఉంచి కేవలం టెస్ట్ క్రికెట్ కి మాత్రమే పరిమితం చేస్తారా అన్న దానిపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది



 అయితే ఈ ఇదే విషయంపై బీసిసిఐ లోని ఒక వర్గం కోహ్లీని కొనసాగించాలి అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరో వర్గం పరిమిత ఓవర్ల క్రికెట్కు ఒక్కరినే కెప్టెన్గా ఉంచడం మేలు అని భావిస్తున్నాడట. మరీ విరాట్ కోహ్లీ వన్డే జట్టుకు కెప్టెన్ గా ఉంటాడా లేదా అన్న విషయం మాత్రం మరో వారం రోజుల్లో తేలిపోతుంది అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఇప్పుడు వరకు విరాట్ కోహ్లీ ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేక పోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: