అహ్మదాబాద్ ఫ్రాంచైజీ యొక్క CVC యాజమాన్యం పై వచ్చిన ఆరోపణలు చర్చించడానికి ఐపీఎల్ పాలక మండలి శుక్రవారం అనగా రేపు కోల్‌కతా లో సమావేశం పరుపుతుంది. అయితే రూ. 5,625 కోట్లకు అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హక్కులను గెలుచుకున్న ఈ కంపెనీ పెట్టుబడులకు సంభందించిన విషయంలో పరిశీలనలో ఉంది. అయితే అహ్మదాబాద్ ఫ్రాంచైజీ భవితవ్యం బ్యాలెన్స్‌లో ఉండటంతో, జే షా, అరుణ్ ధుమాల్, బ్రిజేష్ పటేల్ మరియు ప్రజ్ఞాన్ ఓజాలతో కూడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ పాలక మండలి రేపు సమావేశమవుతుంది. ఇక ఐపీఎల్ 2022 కోసం రిటైన్ కాని ఆటగాళ్ల జాబితా నుండి ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేయాలని రెండు కొత్త జట్లు చూస్తున్నందున, ఈ విషయాన్ని పరిశీలించడానికి బోర్డు నలుగురు సభ్యుల స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తుంది. ముగ్గురు ఆటగాళ్లను నిర్ధారించే వ్యవధి డిసెంబర్ 1న ప్రారంభమైనప్పటికీ బీసీసీఐ ఇంకా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేయనందున దానిని తాత్కాలికంగా నిలిపివేశారు.

అయితే ఇది సంక్లిష్టమైన విషయం మరియు మేము సమావేశంలో ముందుకు వెళ్లే మార్గాన్ని చర్చిస్తాము. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించి వేలంపాటపై నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలని అందరూ కోరుతున్నారు. అనే అంశాన్ని స్వతంత్ర కమిటీ పరిశీలిస్తుంది. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, ”అని ఐపీఎల్ జీసీ సభ్యుడు అన్నారు. CVC క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు చెందిన అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ Irelia Company Pte Ltd, గత నెలలో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ. 5625 కోట్లకు విజయవంతంగా బిడ్ చేసింది. కానీ బెట్టింగ్ కంపెనీలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన కారణంగా, లక్నోతో సహా రెండు కొత్త ఫ్రాంచైజీలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేయడంపై బిసిసిఐ నిలుపుదల చేసింది. బీసీసీఐ మార్గదర్శకత్వం కోసం భారతదేశం యొక్క సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సంప్రదించింది మరియు ఇప్పుడు వారు ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ కమిటీ నిర్ణయమే అంతిమమైనది మరియు దీనికే బీసీసీఐ కట్టుబడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: