ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసినా శ్రేయస్ అయ్యర్ పేరు వినిపిస్తోంది. మొన్నటివరకు టీమిండియాలో కేవలం పరిమిత ఓవర్ల జట్టులో మాత్రమే కొనసాగాడు శ్రేయస్ అయ్యర్. ఇక తనదైన శైలిలో రాణిస్తూ పరిమిత ఓవర్ల జట్టులో ఒక మంచి ప్లేయర్ గా గుర్తింపు సంపాదించాడు. ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అయితే ఈ యువ ఆటగాడికి మొన్నటివరకు అటు టెస్ట్ క్రికెట్ లో మాత్రం అవకాశం దక్కలేదు  అని చెప్పాలి. కానీ ఇటీవల స్వదేశంలో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇక టెస్ట్ ఫార్మాట్లోకి ఆరంగేట్రం చేశాడు శ్రేయస్ అయ్యర్. సాధారణంగా టెస్టు ఫార్మాట్లో ఆరంగేట్రం చేసిన ఆటగాడు మొదట కాస్త ఒత్తిడికి గురవడం లాంటివి జరుగుతూ ఉంటుంది.



 ఎంతో ఓపికగా ఆడాల్సి ఉంటుంది. కాబట్టి యువ ఆటగాళ్లు ఏదో ఒక తప్పు చేసి వికెట్ చేజార్చుకోవటం చేస్తూ ఉంటారు. కానీ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ లో మాత్రం ఎక్కడా ఒత్తిడి కనిపించలేదు అని చెప్పాలి. అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన శ్రేయస్ అయ్యర్ పై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏకంగా అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు శ్రేయస్ అయ్యర్. దీంతో ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అతని ఆటపై ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఇటీవల ఇదే విషయంపై న్యూజిలాండ్ జట్టు వైస్ కెప్టెన్ సౌదీ స్పందించాడు. అరంగేట్రం మ్యాచ్లోనే శ్రేయస్ అయ్యర్ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించటం అద్భుతంగా రాణించడం గొప్ప విషయం అంటూ చెప్పుకొచ్చాడు. అతడితో తమ జట్టుకు ముప్పు పొంచి ఉంది అంటూ సౌదీ అన్నాడు. తొలి మ్యాచ్లో అతని ఆత్మవిశ్వాసాన్ని చూసిన తర్వాత జాగ్రత్త పడుతున్నామని... అయ్యర్ వికెట్ తీయడానికి ప్రణాళికలు రచిస్తున్నాము అంటూ సౌదీ తెలిపాడు.. ఇకపోతే టీమ్ ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా రెండో టెస్టు నిర్ణయాత్మకమైన మ్యాచ్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: