ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ గుర్తింపు ఉన్న క్రీడలలో అటు క్రికెట్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నో దేశాలు క్రికెట్ క్రీడల్లో పాల్గొంటూ ఉండటం గమనార్హం. అయితేక్రికెట్ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని కొత్త రూల్స్ తెరమీదికి వస్తూ ఉంటాయి. ఇక ఆ రూల్స్ క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరచడం  చేస్తూ ఉంటాయి.  సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక బంతికి ఒక వికెట్ పడగొట్టడం సాధ్యం అవుతుంది. అయితే ఒక బంతికి ఒకవైపు వికెట్ కోల్పోయి మరోవైపు రనౌట్ అయినా రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ కేవలం ఒక వికెట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అంపైర్లు .


 ఇలా క్రికెట్ ఆటలో ఒక బంతికి ఒక్క వికెట్ మాత్రమే తీసే అవకాశం ఉంది అని భావిస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు కూడా. కానీ చాలామంది క్రికెట్ ప్రేక్షకులకు ఒక బంతికి రెండు వికెట్లు కూడా తీయవచ్చు అన్న విషయం మాత్రం తెలియదు. అదేంటి ఒక్క బంతికి రెండు వికెట్లు తీయడం.. అదెలా సాధ్యమవుతుంది.. ఒకవేళ రెండు వికెట్లు తీసిన ఒక వికెట్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కదా అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అయితే క్రికెట్ లో ఒకే బంతికి రెండు వికెట్లు తీయడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఐసీసీ రూల్స్ ప్రకారం ఒక బంతికి ఇద్దరు  బ్యాట్స్మెన్లను వికెట్లు తీసిన పెవిలియన్ పంపించే అవకాశం ఉంటుంది.


 అయితే ఇలా ఒక బంతికి రెండు వికెట్లు తీయడం మాత్రం కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే సాధ్యం అవుతుంది అని చెప్పాలి. ఒకవేళ బౌలర్ తొలిబంతి వైడ్ వేసిన సమయంలో బ్యాట్స్మెన్ను కీపర్ స్టంప్ ఔట్ చేస్తే.. బంతి పరిగణలోకి రాదు కానీ స్టంప్ అవుట్ పరిగణలోకి వస్తుంది. ఇక తర్వాతి బంతికి మరొకరిని అవుట్ చేసే వీలు ఉంటుంది. ఇలా జరిగితే రెండు వికెట్లను కూడా పరిగణలోకి తీసుకుంటారు. లేదా బౌలర్ నోబాల్ వేసిన సమయంలో బ్యాట్ మెన్ రన్ అవుట్ అయితే.. బంతి పరిగణలోకి రాదు కానీ రనౌట్ పరిగణలోకి వస్తుంది. ఇక తర్వాతి బంతికి మరో వికెట్ కోల్పోతే అప్పుడు కూడా అంపైర్లు రెండు వికెట్లను పరిగణలోకి తీసుకుంటారు. ఇలా క్రికెట్లో ఐసీసీ రూల్స్ ప్రకారం కేవలం రెండు సందర్భాల్లో మాత్రమే ఒక బంతికి రెండు వికెట్లు తీసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: