ఒకప్పుడు భారత క్రికెట్ లో ఉన్న పరిస్థితులు వీరు. గత కొంతకాలంగా మారిన పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఇండియా క్రికెట్ టీమ్ లో ఒకప్పుడు ప్లేయర్స్ ప్రదర్శనతో సంబంధం లేకుండా అవకాశాలు ఇస్తూనే ఉండేవారు. అలా జరిగింది. కానీ ఇప్పుడు ఒకటి రెండు మ్యాచ్ లు సరిగా ఆడకుంటే కెరీర్ ప్రమాదంలో పడినట్టే అన్న సంకేతాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఇండియన్ క్రికెట్ సెలక్టర్లు ఎలా ఉన్నా ఈ సోషల్ మీడియాలో చేసే ట్రోల్స్ వలన సెలక్టర్లు కూడా ఉపేక్షించడం లేదు. అందుకే ఇప్పుడు సీనియర్ మెన్ క్రికెట్ టీమ్ లో ఉండే ప్లేయర్స్ అందరూ ప్రతిభను కూడగట్టుకుని 100 శాతం ఇస్తున్నారు.

అయితే టెస్ట్ క్రికెట్ లో గత కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్ ప్లేయర్ గా కొనసాగుతున్న వన్ డౌన్ బ్యాట్స్మన్ చతేస్వర్ పుజారా గురించి గత కొంత కాలంగా చర్చ జరుగుతోంది. పుజారా తన టెస్ట్ సెంచరీ సాధించి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతోంది. చివరిగా ఆస్ట్రేలియాతో చేసిన సెంచరీనే ఆఖరిది. పైగా పెద్ద గొప్పగా కూడా ఆడిన దాఖలాలు లేవు. ఇటీవల జరిగిన టెస్ట్ లు అన్నింటి లోనూ వరుసగా విఫలం అవుతున్నాడు. అందుకే సెలక్టర్లు పుజారా విషయంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ లో చూసినా మొదటి టెస్ట్ లో దారుణంగా ఫెయిల్ అయినా, రెండవ టెస్ట్ లో అయినా సత్తా చాటుతాడు అనుకున్నారు.

కానీ ఈ రోజు ఉదయం బ్యాటింగ్ కు వచ్చిన పుజారా ఆశ్చర్యకరంగా స్పిన్నర్ అజాజ్ పటేల్ బౌలింగ్ లో డక్ అవుట్ గా వెను తిరిగాడు. ఈ ప్రదర్శనతో ఛతేశ్వర్ పుజారాకు గడ్డు కాలం అని చెప్పాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి నెక్స్ట్ సిరీస్ లకు పుజారా టీం లో ఉండడు. ఇది పక్కా.  

మరింత సమాచారం తెలుసుకోండి: