ఇటీవలి కాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. టీమిండియాకు భారీ స్కోరు అందిస్తూ  ప్రతిభ చాటుకుంటున్నారు. ఇటీవల టెస్టు ఫార్మాట్లో కి అరంగేట్రం చేసిన శ్రేయస్ అయ్యర్ అరంగేట్ర మ్యాచ్లోనే ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత ఇన్నింగ్స్ లో కూడా 65 పరుగులతో రాణించాడు శ్రేయస్ అయ్యర్. కాగా న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.  ఈ క్రమంలోనే భారత్ న్యూజిలాండ్ మధ్య ప్రస్తుతం ముఖ్యమైన రెండవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణిస్తాడు అనుకున్న  శ్రేయస్ అయ్యర్ తక్కువ పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా సింగిల్ డిజిట్ స్కోర్  కే పరిమితం అయ్యాడు. దీంతో టీమిండియా ఒకానొక దశలో కష్టాల్లో పడిపోయింది అని చెప్పాలి. ఆ సమయంలో మైదానంలోకి వచ్చిన యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్ అద్భుతంగా రాణించాడు. ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. దీంతో మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్ తీరుపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే తాను సెంచరీ చేయడం పై మయాంక్ అగర్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నీ కంట్రోల్ లో ఏదైనా ఉంది అంటే అది నీ బ్యాటింగ్  మాత్రమే నీ బ్యాటింగ్ లో బెస్ట్ ఇవ్వు అంటూ కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.


 ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకున్నా అంటూ మయాంక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు. అయితే తాను బ్యాటింగ్ చేయడానికి రావడానికి ముందు గవాస్కర్ బ్యాటింగ్ వీడియోలను చూసాను అంటూ చెప్పుకొచ్చాడు మయాంక్ అగర్వాల్. బ్యాటింగ్ చేసే సమయంలో బ్యాక్ లిఫ్ట్ తగ్గించాలని గవాస్కర్ సూచించారు ఈ క్రమంలో ఇది నేర్చుకోవడానికి గవాస్కర్ వీడియోలు చూశాను తర్వాత ఆయన భుజం ఎలా ఉందో గమనించి బ్యాక్ లిఫ్ట్  తొలగించే ప్రయత్నం చేశాను అంటూ మయాంక్ అగర్వాల్ చెప్పుకొచ్చాడు. ఇలా గవాస్కర్ వీడియోలు చూసి వచ్చి ఇక అలా ట్రై చేసి సెంచరీ చేసినట్లు మయాంక్ అగర్వాల్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: