ప్రస్తుతం భారత క్రికెట్లో సార్ ప్లేయర్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ తర్వాత భారత క్రికెట్ లో ఎవరికైనా అంత గుర్తింపు గౌరవం  ఉంది అంటే అది రోహిత్ శర్మ కు మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో సార్లు భారత జట్టుకు విజయాలు అందించిన రోహిత్ శర్మ ఐపీఎల్ లో కూడా సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా తన సత్తా ఏంటో చూపించాడు. ఇటీవలే టి20 వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇక టీమిండియాకు రోహిత్ శర్మను పూర్తిస్థాయి టి20 కెప్టెన్గా నియమించింది బీసీసీఐ.


 ఇప్పటికే టి20 కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంతో సక్సెస్ అయ్యాడు. బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. ఏకంగా జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. ఇటీవల స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియాతో ఆడిన టీ20 సిరీస్ కూడా విజయం సాధించి అంతర్జాతీయ క్రికెట్లో కూడా శుభారంభం చేశాడు రోహిత్ శర్మ. అయితే మరికొన్ని రోజుల్లో రోహిత్ శర్మ కు అటు వన్డే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను కూడా అప్పగించ బోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది.



 విరాట్ కోహ్లీ కేవలం టెస్టు కెప్టెన్గా మాత్రమే పరిమితం చేయబోతున్నట్లు గత కొన్ని రోజుల టాక్ వినిపిస్తోంది. అయితే టీ20, వన్డే జట్టుకు కెప్టెన్ తోపాటు రోహిత్ శర్మ కు మరో ప్రమోషన్ కూడా రాబోతుందట. టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్ గా ఉన్న రోహిత్ శర్మ ను  టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా కూడా ఎంపిక చేయాలని బిసిసిఐ భావిస్తోందట. టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు అజింక్యా రహానే. సరిగ్గా రాణించలేక ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే జట్టు నుంచి తప్పించి వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మకు అవకాశం ఇవ్వాలని బిసిసిఐ భావిస్తోందట. ఇలా ఒక రకంగా బిసిసిఐ రోహిత్ శర్మకు వరుసగా ప్రమోషన్స్ ఇస్తుంది అని అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: