ప్రస్తుతం భారత్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. మొదటి మ్యాచ్ డ్రాగా ముగియడం తో ఇక రెండో టెస్టు మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పాయింట్ల పట్టిక లో స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ఈ రెండు జట్లకు కూడా ఇక మ్యాచ్ గెలవడం ఎంతో కీలకంగా మారిపోయింది. అయితే అటు టీమిండియా మొదటి బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే కాస్త దూకుడుగా ఆడినట్లే కనిపించింది  ఈక్రమంలోనే తన స్పిన్ మాయాజాలంతో భారత బ్యాట్స్మెన్లలో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడు న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్.



 రెండవ టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుకు ఎంతో కీలకం గా మారిపోయాడు అని చెప్పాలి. సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కో బౌలర్ రెండు లేదా మూడు వికెట్లు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ ఒకే ఒక్క బౌలర్ ఏకంగా ఇన్నింగ్స్ లో 10వికెట్లు కూడా తీసుకోవడం మాత్రం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో ఇదే జరిగింది అని చెప్పాలి.. న్యూజిలాండ్ స్పిన్నర్స్ అజాజ్ పటేల్ టెస్టు క్రికెట్లో ఒక సరికొత్త రికార్డును సృష్టించాడు.


 పదికి 10 వికెట్లు పడగొట్టి సంచలనమే సృష్టించాడు.. ఇలా ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా ప్రపంచ రికార్డులకెక్కాడు న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్. 47 ఓవర్లు వేసిన ఆజాద్ పటేల్ 119 పరుగులు ఇచ్చి పది వికెట్లు సాధించాడు. దీంతో ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ కూడా అతని ప్రతిభ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు   అయితే అజాజ్ పటేల్ కంటే ముందు జిమ్ లేకర్  అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: