ఈ విషయం ఒక్కటే న్యూజిలాండ్ కు ఊరట కలిగించిన విషయం. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన న్యూజిలాండ్ కేవలం 62 పరుగులకు ఆల్ ఔట్ అయిపోయింది. కెప్టెన్ విలియంసన్ గాయం కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యడు. ఫాలో ఆన్ ప్రమాదంలో పడిన కివీస్ కు బ్యాటింగ్ ఇవ్వకుండా... సెకండ్ ఇన్నింగ్స్ ను ఇండియా తీసుకుంది. ప్రస్తుతం మయంక్ మరియు పుజారాలు వికెట్ పడకుండా 69 పరుగులు చేశారు. ఈ రోజు ఇంకో 100 పరుగులు చేసి మొత్తం 450 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచడానికి ఇండియా ప్రణాళిక చేస్తుంది.
ఇప్పుడు ఇండియా బౌలర్లు అంతా ఒక రిథమ్ లో ఉన్నారు. కాబట్టి కివీస్ ను ఆల్ ఔట్ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. ఈ మ్యాచ్ కనుక కివీస్ ఓడిపోతే ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకుండా తిరిగి స్వదేశానికి తిరిగి వెళ్లనుంది. అయితే ఈ విజయం ఈ రోజా? లేదా రేపా అన్నది మాత్రమే తెలియాల్సి ఉంది.