ఈ రోజున మన ప్రపంచ క్రికెటర్ శిఖర్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. శిఖర్ ధావన్ ని అందరూ ముద్దుగా శిఖర్, గబ్బర్ సింగ్ అని పిలుస్తూ ఉంటారు. డిసెంబర్ 5 1985 ఢిల్లీలో సునైనా మరియ మహేంద్ర పాల్ కు జన్మించారు.శిఖర్ ధావన్ సెయింట్ మార్క్స్ సెకండరీ పబ్లిక్ స్కూల్ లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు.. అల్లరిని భరించలేక తమ తల్లిదండ్రులు ఒక రూమ్ లోకి వేసి బంధించే వారు.

అయితే దావన్ మాత్రం కిటికీలో నుంచి బయటకి వచ్చి క్రికెట్ ఆడికి వెళ్లేవాడు. క్రికెట్ అంటే ఎక్కువ పిచ్చి ఉండడంతో 12 సంవత్సరాలకే sonnet cricket club లో చేరాడు. అక్కడ తన కోచ్ తార సింహ. ఇతను ఇప్పటి వరకు 12 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్ లను తయారు చేశాడు. అయితే గబ్బర్ మొదట్లో క్రికెట్ కీపర్ గా ఆడేవారు.ఆ తరువాత బ్యాట్స్ మెన్ గా ఎదిగాడు.1999 లో గబ్బర్ అండర్-16  కు ఆడారు.అప్పుడు 9 ఇన్నింగ్సులో ఆడి 765 పరుగులు చేశాడు.

ఇక ఆ తర్వాత నెమ్మదిగా ఆడుతూ 2004 లో అండర్ 19 వరల్డ్ కప్ లో ఆడాడు. అప్పుడు బంగ్లాదేశ్ పై 7 ఇన్నింగ్స్ అడి,565 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత 2004 లో రంజీ ట్రోఫీ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అప్పుడే ఎంఎస్ ధోని తో ఓపెనింగ్ చేయడానికి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక వీరిద్దరూ కలిసి ఒక సిరీస్లో 266 రన్స్ పార్ట్నర్ షిప్ చేశారు.

అలా ఒకసారి క్రికెట్ రూమ్ లో ఉండగా హర్భజన్ సింగ్.. ఫేస్ బుక్ లో ఆయుష ముఖర్జీ.. ప్రొఫైల్ ఫోటోను చూపించారు. ఆమె తెగ నచ్చిందట. ఇక ఆమె కూడా ఒక బాక్సర్, ఇక ధావన్ కంటే ఆమె 10 సంవత్సరాలు పెద్దది. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరి వివాహం చేసుకున్నారు.2013 లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: