ఇప్పటికే రెండు సార్లు ఒలింపిక్స్ పతకాలు గెలిచిన భారత టెన్నిస్ క్రీడాకారిణి పీవీ సింధు బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ కు చేరిన విషయం తెలిసిందే. అయితే ఆఖరి పోరులో దక్షిణ కొరియాకు చెందిన క్రీడాకారిణి యాన్ సెయాంగ్ చేతిలో ఓటమిపాలు అయ్యింది. ఫైనల్స్ లో తన ప్రత్యర్థిపై సింధు 21-16, 21-12 తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 2020 టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్యం సాధించింది. అక్కడి నుండి ఆమె ఒక టైటిల్ కూడా గెలవలేదు. అందుకే ఈ టూర్ లో మొదటి నుండి అద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ చివరివరకు వెళ్ళింది. ఆఖరి పోరులో ఓడిపోయి, కాంస్యంతో సరిపెట్టుకుంది. యాన్ గతంలో ఇండోనేషియా మాస్టర్స్, ఇండోనేషియా ఓపెన్ టైటిల్స్ ను గెలుచుకుంది. అక్టోబర్ లో డెన్మార్క్ లో జరిగిన పోటీలలో క్వార్టర్ ఫైనల్స్ లో సింధును ఓడించింది.

సింధు టర్కీ లో ఫైనల్స్ కు చేరడం ఇది మూడోసారి. 2018లో టైటిల్స్ గెలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తోలి భారతీయురాలిగా పేరుగాంచింది. కేవలం 19ఏళ్ళ యాన్ ఆఖరి పోరులో మొదటి నుండి ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది. దానితో సింధు సమాధానం చెప్పలేక పోయింది. ఆట ఆరంభం నుండి పట్టుబిగించిన యాన్ విరామం తరువాత 11-6తో ఆధిక్యం సాధించగలిగింది. అయినప్పటికీ సింధు తన అనుభవంతో పాయింట్లు సాధిస్తూనే ఉంది. కానీ వెనకబడటంతో 8-18తో సరిపెట్టుకుంది. మొదటి గేమ్ లో మొత్తం 16-20 తో పెద్దగా అంతరం లేకుండా చూడగలిగింది సింధు.

రెండో గేమ్ లో ప్రారంభం నుండి సింధు రెండు రెండు పాయింట్లు సాధించి స్కోర్ బోర్డు సమం చేసింది. అప్పటి స్కోర్ 3-3, 4-4 గా ఉంది. అనంతరం కూడా యాన్ అధిగమించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సింధు స్కోర్ ను 6-6 గా సమం చేసింది. దీనితో రెచ్చిపోయిన యాన్ ఆధిపత్యం కొనసాగించడం ప్రారంభించి 9-6గా స్కోర్ చేసింది. విరామం ముందు 11-8 స్కోర్ ఉంది. అనంతరం కూడా యాన్ ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది, దీనితో స్కోర్ బోర్డు 15-8 వద్ద కు చేరింది. అక్కడి నుండి సింధు పాయింట్లను తగ్గించగలిగింది కానీ, యాన్ ను అడ్డుకోవడం సాధ్యపడలేదు. అందుకే కాంస్యంతో సరిపెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: