సాధారణంగా సెలబ్రిటీలు కు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా క్రికెటర్లకు సంబంధించి ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అదే వైరల్ గా మారిపోతూ ఉంటుంది.  గత కొంత కాలం నుంచి టీమిండియా యువ క్రికెటర్ ప్రేమ వ్యవహారం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో యువ ఆటగాడు శుబ్ మన్ గిల్ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చేస్తూ ఉంటాయి.



 ఇలా యువ ఆటగాడు ప్రేమ వ్యవహారం కాస్త గత కొన్ని రోజుల నుండి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా శుబ్ మన్ గిల్ ఓపెనింగ్ కు రాలేదు. అతని స్థానంలో పూజారా ఓపెనర్ గా వచ్చాడు. కానీ మూడవ రోజు మాత్రం శుబ్ మన్ గిల్ ఫస్ట్ డౌన్ వచ్చాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ యువ ఆటగాడు సౌదీ వేసిన బంతిని మిడ్ వికెట్ దిశగా బౌండరీకి తరలించాడు.


 ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. శుబ్ మన్ గిల్ బౌండరీ కొట్టగానే స్టాండ్స్ లో ఉన్న అభిమానులు అందరూ కూడా సచిన్ సచిన్ అంటూ గట్టిగా అరిచారు. ఇలా అభిమానులందరూ సచిన్ అంటూ అరిచిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో కాస్త ప్రస్తుతం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అటు శుబ్ మన్ గిల్ గానీ మరోవైపు సారా టెండూల్కర్ గానీ ప్రేమ విషయంలో ఎక్కడా స్పందించలేదు అనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gil