ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులందరిలో కూడా ఒకటే చర్చ ఐపీఎల్ 2020 2 సీజన్ ఎలా ఉండబోతుందో అనీ.. ఎందుకంటే ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్ ఎలా ఉంటుంది.. ఏ జట్టు ఎలా రాణిస్తోంది అన్నదానిపై ప్రేక్షకులకు ఒక క్లారిటీ ఉండేది. కానీ ఇటీవలే ఐపీఎల్ లోకి కొత్తగా రెండు జట్లు ఎంట్రీ ఇవ్వడం.. ఇక ఐపీఎల్ కోసం మెగా వేలం కూడా నిర్వహిస్తూ ఉండడంతో ఏ ఆటగాడు ఏ జట్టు లోకి వెళ్తాడు ఏ జట్టు ఐపీఎల్ లో ఎలా రాణిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే ఐపీఎల్ 2022 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించనుండగా.. ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది.



 అయితే ఈ రిటెన్షన్ ప్రక్రియలో ఎన్నో జట్లు స్టార్ ఆటగాల్లను సైతం వదులుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వస్తే జట్టుకు కెప్టెన్గా ఫైనల్ వరకు తీసుకువెళ్లిన శ్రేయస్ అయ్యర్ ను కనీసం రిటైన్ చేసుకోవడానికి కూడా జట్టు యాజమాన్యం ఆసక్తి చూపకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం నిలకడ కల ఆటగాడిగా ఒక మంచి కెప్టెన్గా పేరుతెచ్చుకున్న శ్రేయస్ అయ్యర్ మెగా వేలంలో చాలా ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఐపీఎల్ లోకి వచ్చిన జట్లకు కెప్టెన్గా ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


 ఈక్రమంలోనే శ్రేయస్ అయ్యర్ ను అహ్మదాబాద్ ప్రాంచైజీ సొంతం చేసుకునేందుకు సిద్ధం అవుతోందట. ఎంత పోటీ ఉన్నప్పటికీ ఎంతైనా సరే చెల్లించేందుకు రెడీగా ఉందట. ఇక అహ్మదాబాద్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించ బోతున్నాడు అనే ఒక టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి శ్రేయస్ అయ్యర్ తో ఒప్పందం కూడా కుదుర్చుకుందట.  ఫ్రీ టికెట్ ద్వారా శ్రేయస్ అయ్యర్ ను అహ్మదాబాద్ జట్టు ఎంపిక చేసుకో తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం పదిహేను కోట్లు కూడా ఆఫర్ చేసిందట అహ్మదాబాద్ ఫ్రాంచైజీ. దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: