ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా పేరుపొందిన విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్గా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. తనదైన వ్యూహాలతో ఎప్పుడూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై విజయాలు సాధిస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో టీమిండియా కు ఒక్క సీటు కూడా అందించలేకపోయాడు అన్న అపవాదు ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియాతో ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది అన్నది మాత్రం అందరికి తెలిసిన నిజం. ఇలా తన కెప్టెన్సీలోని టీమిండియాకు ఎన్నో మరపురాని విజయా లను అందించాడు.


 అయితే ఇప్పటికి ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఎన్నోసార్లు ఒంటి చేత్తో జట్టును గెలిపించడం సందర్భాలు ఉన్నాయి. భారీ స్కోర్లు చేస్తూ రికార్డుల మోత మోగించాడు విరాట్ కోహ్లీ. ఇలా తనదైన బ్యాటింగ్ తో ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టాడు. రికార్డుల రారాజు గా మారిపోయాడు.. ఒక బ్యాట్మెన్గా రికార్డులు సాధించడమే కాదు అటు కెప్టెన్గా కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పాడు అని చెప్పాలి. ఇక టీమిండియా టెస్టు కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఇటీవలే మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఏ భారత టెస్ట్ కెప్టెన్ సాధించని రికార్డును విరాట్ కోహ్లీ సాధించాడు.


 ప్రత్యర్థి జట్టును అత్యంత ఎక్కువ సార్లు 100 పరుగులకే ఆలౌట్ చేసిన జట్టుకు నాయకత్వం వహించిన కెప్టెన్ గా నిలిచాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా మూడు సార్లు  ప్రత్యర్థి జట్టును 100 పరుగులకే కట్టడి చేసి ఆలౌట్ చేసింది. ఈ అరుదైన రికార్డును సాధించిన మొదటి భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఇక ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ రెండుసార్లు 100 పరుగులలోపు ప్రత్యర్థి జట్టును కట్టడి చేసిన కెప్టెన్ లుగా ఉన్నారు. ఇక ఆ తర్వాత సునీల్ గవాస్కర్ అజారుద్దీన్ లు సైతం ఒక్కోసారి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. ఇక భారత దిగ్గజ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం ఇలాంటి రికార్డు సాధించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: