ఇటీవలి కాలంలో టీమిండియా లో స్థానం దక్కించుకోవడానికి ఎంతో మంది యువ ఆటగాళ్లు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సైతం సద్వినియోగం చేసుకుంటూ టీమిండియా లో అవకాశాలు దక్కించుకుంటూ ఉండటం గమనార్హం. దీంతో కొంతమంది సీనియర్ క్రికెటర్లకు టీమిండియాలో అవకాశం దక్కడం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఐపీఎల్ పుణ్యమా అని ప్రతి ఏడాది కూడా ఎంతోమంచి ప్రతిభ గల ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. తక్కువ సమయంలోనే టీమిండియాలో అవకాశం దక్కించుకున్నారు. దీంతో నేటి రోజుల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ ఆ టీమిండియాలో స్థానం దక్కుతుంది అని గ్యారెంటీ మాత్రం లేకపోయింది. ఎందుకంటే.. మాత్రం విపరీతమైన పోటీ ఉంది అని చెప్పాలి.


 ఇక ఆ పోటీని తట్టుకుని టీమిండియాలో అవకాశం దక్కించుకోవడం అంటే అదృష్టంగానే మారిపోయింది. మరి ఇప్పుడు తెలుగు తేజం టీమిండియా బ్యాట్స్మెన్ హనుమ విహారి కి ఇలాంటి అదృష్టం వర్తిస్తుందా లేదా అన్న దానిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. హనుమ విహారి కి టీమిండియా జట్టులో స్థానం దక్కుతుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా  మారిపోయింది. ఎందుకంటే ప్రస్తుతం యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తూ ఉండటం టీమిండియాలో స్థానం కోసం పోటీ కూడా పెరిగిపోవడంతో హనుమ విహారి స్థానం డైలమాలో పడిపోయింది.



 మరికొన్ని రోజుల్లో టీమిండియా జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలోనే టీమిండియా జట్టులో అటు హనుమ విహారి ఎంపిక పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియా వెటరన్ ప్లేయర్ దినేష్ కార్తీక్ ఈ విషయంపై స్పందించాడు. ప్రస్తుతం భారత జట్టు లో హనుమ విహారి కి చోటు లేకపోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు . ప్రస్తుతం టీమిండియాలో ఓపెనర్,  మిడిలార్డర్ స్థానాలకు  తీవ్రమైన పోటీ ఉంది అంటూ చెప్పాడు దినేష్ కార్తీక్.ఇలాంటి సమయంలో హనుమ విహారి కి స్థానం దక్కడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియా జట్టులో ఉన్నాడు హనుమ విహారి. వరుసగా 54,72, 50 స్కోర్లతో అదరగొడుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: