మొన్నటి వరకు భారత క్రికెట్లో మూడు ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగాడు విరాట్ కోహ్లీ. ఇక జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళాడు. జట్టులో కీలక బ్యాట్మెన్గా రాణించడమే కాదు. కెప్టెన్గా అందరితో కలివిడిగా ఉంటూ జట్టును ముందుకు తీసుకెళ్ళాడు. కానీ ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ మాత్రం గెలిపించుకోలేక పోయాడు విరాట్ కోహ్లీ. అయితే ఎన్నో రోజుల నుంచి కెప్టెన్సీ నుంచి తప్పించాలని డిమాండ్ రాగా.. ఇక ఇటీవలే తాను టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. వన్డే టెస్ట్ ఫార్మాట్లకు తాను కెప్టెన్గా కొనసాగుతాను అంటూ తెలిపాడు.


 బ్యాటింగ్ పై దృష్టి పెట్టడానికి ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్ గా రోహిత్ శర్మ నియమించింది బిసిసీఐ.అయితే కేవలం టి20 లకు మాత్రమే కాదు వన్డే జట్టుకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్ గా నియమించే అవకాశం ఉంది అని అందరూ భావించారు. విరాట్ కోహ్లీని కేవలం టెస్ట్ లకు మాత్రమే కెప్టెన్గా పరిమితం చేసే అవకాశం ఉంది అని అనుకున్నారు. అయితే ప్రస్తుతం కెప్టెన్స్ విషయంలో విరాట్ కోహ్లీ కి అవమానం జరిగింది అంటూ ఒక టాక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.


 టి20 కెప్టెన్సీ ని వదులుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటాడని బీసీసీఐ భావించిందట. కానీ గతంలోనే టెస్టులకు వన్డేలకు కెప్టెన్ గా కొనసాగుతానని విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అయితే విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని ఎదురుచూసినప్పటికీ కోహ్లీ మాత్రం అలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఇక బీసీసీఐ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ నీ తప్పించి కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను నియమించింది అని టాక్ వినిపిస్తుంది.. ఇది ఎంతవరకు నిజం అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: