ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నాడు రోహిత్ శర్మ. మొన్నటి వరకు భారత క్రికెట్ లో కీలక పాత్ర వహించిన రోహిత్ శర్మ ఇక ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అలవోకగా డబుల్ సెంచరీలు చేయడం లో రోహిత్ శర్మ తనకు తానే సాటి అని చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో సార్లు ఒంటిచేత్తో భారత్కు విజయాలు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు భారీ సిక్సర్లతో అదరగొడుతు ఉంటాడు.


 ఇక ఓపెనర్గా బరిలోకి దిగుతూ టీమిండియాకు మంచి ఆరంభాన్ని ఇవ్వడంలో రోహిత్ శర్మ కీలకపాత్ర వహిస్తూ ఉంటాడు. ఇకపోతే అటు ఐపీఎల్ లో కూడా రోహిత్ శర్మ ప్రస్థానం ఎంతో సక్సెస్ఫుల్గా సాగిపోయింది అనే చెప్పాలి.. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జట్టును ఎంతో సమర్ధవంతంగా ముందుకు నడిపించాడు రోహిత్ శర్మ. ఏకంగా ఎవరికి సాధ్యం కాని రీతిలో ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్గా తనకంటూ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఇటీవల రోహిత్ శర్మ టీమిండియా లో ప్రమోషన్ కూడా పొందాడు. మొన్నటివరకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన రోహిత్ శర్మ ఇక ఇప్పుడు టి20 కెప్టెన్ గా మారిపోయాడు.


 ఇలా ప్రస్తుతం భారత క్రికెట్లో ఎన్నోఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న రోహిత్ శర్మ కు ఒకప్పుడు జట్టులో స్థానం దొరకడం కష్టంగా మారిపోయింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు.. దీంతో సెలెక్టర్లు రోహిత్ శర్మ ను పక్కన పెట్టేశారు. ఈ క్రమంలోనే 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్ లో కూడా రోహిత్ శర్మకు చోటు కల్పించలేదు. ఇక ఆ సమయంలో హిట్ మాన్ రోహిత్ శర్మ ఎంతగానో నిరాశకు లోనయ్యారు. ఇక తన కెరీర్లో ఇదే ఎంతో బాధాకరమైన విషయం అంటూ రోహిత్ శర్మ పలుమార్లు సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించాడు. ఇక సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అని అప్పట్లో రోహిత్ శర్మ ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఉదయించిన సూర్యుడిలాగా మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసి అద్భుతంగా రాణించి ఏకంగా   కెప్టెన్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: