ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడు గా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. భారత అంతర్జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అప్పటినుంచి అద్భుతంగా రాణిస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇక ఎన్ని రికార్డులు కొల్లగొట్టిన పరుగుల దాహం తీరలేదు అన్నట్లుగానే విజృంభించి ఆడుతూ ఉంటాడు. అయితే దూకుడైన ఆటకు మారుపేరైన విరాట్ కోహ్లీ ఇక ధోనీ తర్వాత భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు. ఇలా ఒక వైపు జట్టును  ముందుకు నడిపిస్తూనే మరోవైపు కీలక బ్యాట్స్మెన్గా భారీగా పరుగులు చేస్తూ వచ్చాడు. ఇలా ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ ఏకంగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు అని చెప్పాలి.


 ఎప్పుడూ భారీగా పరుగులు చేస్తూ దిగ్గజాలు సాధించిన రికార్డులని ఎంతో తక్కువ ఈ సమయంలోనే అలవోకగా బద్దలు కొడుతాడు విరాట్ కోహ్లీ. అలాంటి అత్యుత్తమ ఆటగాడు ఇప్పుడు మాత్రం పేలవమైన ఫామ్ లో కొనసాగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గత కొంత కాలం నుంచి విరాట్ కోహ్లీ సరైన ఫామ్ కొనసాగించలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి దాదాపురెండేళ్లు పూర్తి అయిపోయాయి అన్న విషయం తెలిసిందే. దీంతో అటు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ  స్థానం పడిపోతుంది.



 ఇకపోతే ఇటీవల గాయం నుంచి కోలుకున్న విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశం తరఫున ఆడటాన్ని తాను ఎప్పటికీ గౌరవంగా భావిస్తున్నట్టు విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. కొన్ని కొన్ని సార్లు అన్నీ మనం అనుకున్నట్లు జరగకపోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. గత ఏడాది తన ఆటతీరు పై ప్రభావం చూపిందని మీడియాతో వెల్లడించాడు విరాట్ కోహ్లీ. అయితే నెంబర్లు చూసి ఆటగాడిని అంచనా వేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు. సమిష్టి కృషి కారణంగానే గత నాలుగేళ్ల నుంచీ టీమిండియా బాగా రాణిస్తుందని విజయాలు సాధిస్తోంది అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: