శ్రీలంక క్రికెట్ లో ఇటీవలే ఒక యువ క్రికెటర్ తీసుకున్న నిర్ణయం కాస్త సంచలనంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మంచి ఫామ్ లో దూసుకుపోతున్న యువ క్రికెటర్ రాజకప్ప ఏకంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపి అందరికీ షాకిచ్చాడు. 30 ఏళ్ల వయసులో యువ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించడం అందరూ ఆశ్చర్యపోయారు. అంతే కాకుండా ఇక శ్రీలంక క్రికెట్ లో రాజ కప్ప రిటైర్మెంట్ కు సంబంధించిన తీవ్రమైన చర్చ జరిగింది. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో రాజకప్పా రిటైర్మెంట్ ప్రకటించటానికి కారణాలు ఏమిటి అన్న దానిపై ఎంతోమంది చర్చించుకున్నారు. అయితే అటు శ్రీలంక క్రికెట్ బోర్డు తీసుకు వచ్చిన కొత్త ఫిట్నెస్ రూల్స్ కారణంగానే మనస్థాపం చెందిన రాజకప్ప తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించి ఉంటాడు అని అందరూ అనుకున్నారు. ఫిట్నెస్ టెస్ట్ లో పాస్ కాకపోతే ఆటగాళ్ల ఫీజులో కోత విధిస్తాము అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం కారణంగానే యువ క్రికెటర్ రాజకప్ప  రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని ఉంటాడని భావించారు ఎంత మంది మాజీ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే వెంటనే అతను రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కోరారు. ఇక అటు అభిమానులు కూడా రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ కోరడం గమనార్హం. ఇక ఇటీవలే యువ క్రికెటర్ రాజకప్ప తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించి ఎంతో మంది అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించడం గమనార్హం. జనవరి 3వ తేదీన అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన రాజకప్ప కుటుంబ బాధ్యతల కారణంగా నే ఇక రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటున్నాను అంటూ వివరణ ఇచ్చాడు. కానీ ఇప్పుడు శ్రీలంక క్రికెట్ బోర్డుతో చర్చల తర్వాత మళ్లీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకునేందుకు యువ క్రికెటర్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక రాజకప్ప రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని మళ్ళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులందరూ ఫుల్ హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: