ఈసారి ఎలాగైనా గెలుస్తాం గెలిచి తీరుతాము అనే పట్టుదల ప్రతి ఒక్కరిలో ఉంది. మునుపటి తో పోల్చి చూస్తే జట్టు కూడా ఎంతో బలంగా కనిపిస్తోంది . ఇప్పటివరకు ఏ కెప్టెన్ సాధించనీ రికార్డును నేను సాధించి సౌత్ ఆఫ్రికా టెస్టు సిరీస్లో భారత జట్టుకు విజయం అందిస్తాను అనే కసి కెప్టెన్ కోహ్లి లో పాతుకుపోయింది. ఇక ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దృఢసంకల్పంతో టీమిండియా ముందుకు సాగింది. ఈ క్రమంలోనే మొదటి టెస్టు మ్యాచ్లో భారీ  విజయం సాధించి శుభారంభం చేసింది టీమిండియా.  కానీ ఆ తర్వాత రెండవ టెస్ట్ మ్యాచ్లో ఓటమి చవిచూసింది. విజేతను నిర్ణయించే కీలకమైన మూడో మ్యాచ్లో వీరోచిత పోరాటం చేసినప్పటికీ టీమిండియా చివరికి మళ్లీ ఓటమి చవిచూసింది. దీంతో సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవాలన్న టీమ్ ఇండియా కల కలగానే మిగిలిపోయింది. విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగిన టీమిండియా కు చివరికి భంగపాటు తప్పలేదు. నిర్ణయాత్మకమైన మూడో టెస్టు సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుతంగా రాణించి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను 2-1 తేడాతో సిరీస్  కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికా జట్టు. టీమిండియా తమ ముందు నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి దక్షిణాఫ్రికా జట్టు ఎంతో సునాయాసంగా చేధించింది అని చెప్పాలి. దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ కెగన్ పీటర్సన్ 82 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. దస్సెన్ 41 బావుమా 32 నాటౌట్గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక టీమిండియా బౌలర్లు లో జస్ప్రిత్ బూమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ లు తలో వికెట్ పడగొట్టారు. అయితే మూడో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుందని అభిమానులు అందరూ ఎదురు చూస్తున్న సమయంలో టీమిండియా ఓటమి చవి చూడడం తో అభిమానులందరూ ఎంతో నిరాశ లో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: