ఎవరూ ఊహించని విధంగా అనూహ్యమైన నిర్ణయం తీసుకొని టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అయితే ఇక ఇప్పుడు భారత క్రికెట్ ప్రేక్షకుల అందరి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఒక్కటే. టెస్ట్ ఫార్మాట్ కి టీమిండియాకు కెప్టెన్ గా ఎవరు కాబోతున్నారు అని. అయితే ప్రస్తుతం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నాడు అని అందరూ ధీమాతో ఉన్నప్పటికీ.. ఇక గత కొన్ని రోజుల నుంచి పంత్, కె.ఎల్.రాహుల్ పేర్లు వినిపిస్తూ ఉండటం మాత్రం కొత్త చర్చకు దారితీస్తుంది అని చెప్పాలి.


 వయస్సు ఫిట్నెస్ దృశ్య బీసీసీఐ రోహిత్ శర్మ వైపు అంతగా మొగ్గు చూపకపోవచ్చు.. ఇతరులకు టెస్ట్ కెప్టెన్సీ అప్పగించవచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు మాజీ క్రికెటర్లు సైతం రిషబ్ పంత్ కు మద్దతు పలుకుతూ టెస్ట్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బహిరంగంగానే  రిషబ్ పంత్ కి ఓటు వేస్తున్నారు. అయితే ఇక ఈ విషయంపై అటు క్రికెట్ ప్రేక్షకులందరిలో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడింది.  అయితే ఈ విషయంపై  బీసీసీఐ పూర్తి క్లారిటీతో ఉందట. ఎవరు ఏమనుకున్నా అటు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ కే టెస్ట్ కెప్టెన్సీ ను కూడా అప్పగించాలని ఆలోచనతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.


 టీమిండియా కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు అతనికి వైస్ కెప్టెన్గా ప్రమోషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు అతనే సారథిగా ఉండబోతున్నాడు. అంతేకాదు వైస్ కెప్టెన్ గా ఉన్న వ్యక్తిని ఇక తర్వాత కాలంలో కెప్టెన్ గా నియమించడం భారత జట్టులో కొనసాగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను కెప్టెన్గా కొనసాగించే అవకాశం ఉంది అని బిసిసిఐ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే టెస్ట్ కెప్టెన్సీ ఎవరికీ అప్పగించాలనే దానిపై క్లారిటీ ఉన్నప్పటికీ వైస్ కెప్టెన్సి ఎవరికి ఇవ్వాలనే దానిపై మాత్రం బిసిసిఐ తీవ్ర కసరత్తు చేస్తుందట. ముఖ్యంగా జూనియర్ల కే వైస్ కెప్టెన్సీలో పెద్దపీట వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: