అతను టీమ్ ఇండియా లో కీలక ఆటగాడు.. ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించగలిగిన సత్తా ఉన్నోడు.. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతిసారి అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు.. ఇక అతని ఆటతీరు కు రికార్డులన్నీ దాసోహం.. ఇప్పటివరకు అతను సాధించిన రికార్డులు అన్నీ ఎంతో గొప్పవి అని చెప్పవచ్చు. కేవలం జట్టులో కీలక ఆటగాడిగా మాత్రమే కాదు కెప్టెన్గా ఏకంగా మూడు ఫార్మాట్లలో కూడా  జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. ఇలాంటి విరాట్ కోహ్లీ గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. టి20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికినఅప్పటి నుంచి ఆ తర్వాత వన్డే కెప్టెన్ గా తొలగించడం.. ఇటీవలే విరాట్ కోహ్లీ స్వయంగా టెస్ట్ కెప్టెన్సీపై స్వస్తి పలకడం వరకు అన్ని చక చక జరిగిపోయినా అటు ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్  మాత్రం ఎంతగానో పెరిగిపోయింది.


 సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి అటు బిసిసిఐ అధికారులకు పోసగడం లేదని.. అందుకే మనసు ఒప్పుకోకపోయినా  కోహ్లీ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నాడు అన్న మాట మాత్రం ప్రతి ప్రేక్షకుడు అనుకుంటున్నది. ఇక వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుండి తప్పించిన కూడా తన చిరునవ్వుతోనే స్వాగతించాడు. తనకు ఇష్టం లేకపోయినప్పటికీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు అన్న బాధ లోపల ఎంత ఉన్నప్పటికీ జట్టు ఆటగాళ్లకు మాత్రం అది తెలియకుండా సౌత్ఆఫ్రికా పర్యటనలో చిరునవ్వుతోనే  జట్టును ముందుకు నడిపించాడు.



 ఇక సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ విజయం సాధించి తన కెప్టెన్సీ సత్తా ఎంతో బిసిసిఐకి నిరూపించాలి అని అనుకున్నాడు. కానీ ఏం చేస్తాం అన్నీ అనుకున్నట్లు జరిగితే మనం మనుషులం ఎందుకు అవుతాము. దేవుళ్లము అవుతాం కదా విరాట్ కోహ్లి విషయంలో కూడా ఇదే జరిగింది. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్లో మొదటి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసిన కోహ్లీ సేనకు తర్వాత రెండు మ్యాచ్ లలో కూడా నిరాశ తప్పలేదు. దీంతో 1-2 తేడాతో చేజార్చుకుంది టీమ్ ఇండియా.



దీంతో కోహ్లీ మనసు ఇంకా బాధ పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తారు.. వాళ్ళు తపించడమెందుకు నేనే తప్పుకుంటా అనుకున్నాడో ఏమో ఇష్టం లేకపోయినా టెస్ట్ కెప్టెన్సీ గుడ్ బై చెప్పేసాడు. అయితే ఇటీవలే బీసీసీఐ కోహ్లీకి ఘనంగా సన్మానించాలని అనుకుందట. కానీ ఇంత చేసిన తర్వాత ఇక సన్మానం ఎందుకు అనుకున్నాడేమో అక్కర్లేదు అంటూ బీసీసీఐ ఆఫర్ ను తిరస్కరించాడట కోహ్లీ. ఇలా ఒక వైపు కెప్టెన్సీ నుంచి తప్పుకొని మరోవైపు సన్మానాన్ని తిరస్కరించి కోహ్లీ బిసిసిఐకి ఊహించని షాక్ ఇచ్చాడు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: