ఈ ఏడాది ఐపీఎల్ లోకి రెండు కొత్త జట్లు రావడంతో బీసీసీఐ మెగా వేలం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాత 8 జట్లు తానా రిటెన్షన్ ప్రక్రియనును ముగించగా... కొత్తగా వచ్చిన జట్లకు ఇద్దరు ఆటగాళ్లను ఎంచుకోవడానికి ఈ నెల చివరి వరకు సమయం ఉంది. కానీ ఈ ఐపీఎల్ మెగా వేలానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఏ ఆట‌గాడిని ఏ టీం కోనుగోలు చేయ‌బోతుంద‌నే ఆస‌క్తి కూడా పెరుగుతుంది. ఈ వేలానికి సంబంధించి చాలా వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా సమాచారం ఇంత‌కాలం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను పంజాబ్ కింగ్స్ వేలంలో ద‌క్కించుకోనుంద‌ట‌. వచ్చే ఏడాది జట్టు కెప్టెన్సీ బాధ్యతలు శ్రేయ‌స్ అయ్య‌ర్‌ చేతిలో పెట్టాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోందట..!

అయితే ఇంత‌కాలం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వచించిన అయ్య‌ర్‌కు... ఢిల్లీ రిటెన్ష‌న్ ప్లేయ‌ర్ల జాబితాలో చోటు ల‌భించ‌లేదు. దీంతో ఈ సారి అయ్య‌ర్ వేలంలో పాల్గొననున్నాడు. ఇంత‌కాలం అయ్య‌ర్ కొత్త జట్లైనా ల‌క్నో లేదా అహ్మ‌దాబాద్‌ల‌లో ఏదో జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ తాజా స‌మాచారం ప్ర‌కారం అయ్య‌ర్‌ను వేలంలో పంజాబ్ కింగ్స్ జ‌ట్టు కోనుగోలు చేయ‌నుంద‌ట‌. ఇంతకముందు ఆ జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌న కేఎల్ రాహుల్ ఈ సీజ‌న్‌కు పంజాబ్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాడు. దాంతో ఇప్పుడు పంజాబ్ జట్టుకు కెప్టెన్ అవసరం ఏర్పడింది. కానీ ఆ జట్టు రిటైన్ చేసుకున్న మయాంక్ అగర్వాల్ కే... ఆ బాధ్యతలు అప్పగిస్తారు అని అనుకున్నారు. కానీ తాజాగా సమాచారం ప్రకారం అయ్య‌ర్‌ను టీంలో చేర్చుకోని కెప్టెన్సీ బాధ్య‌త‌లు అత‌నికే ఇవ్వాలని పంజాబ్ ఫ్రాంచైజ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో 87 మ్యాచ్‌లు ఆడిన శ్రేయ‌స్ అయ్య‌ర్ 31 స‌గ‌టుతో 2375 ప‌రుగులు చేశాడు. ఇందులో 16 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ipl