మొన్నటి వరకు భారత క్రికెట్ లో మూడు ఫార్మాట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగాడు విరాట్ కోహ్లీ. ధోని తర్వాత కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన విరాట్ కోహ్లీ తనదైన శైలిలో జట్టును ముందుకు నడిపించడంలో సక్సెస్ సాధించాడు అనే చెప్పాలి. ఇప్పుడు వరకు ఎన్నో ద్వైపాక్షిక సిరీస్ లో కూడా విరాట్ కోహ్లీ టీమిండియాకు  అద్భుతమైన విజయాన్ని అందించాడు. అయితే విరాట్ కోహ్లీ ఆటతీరు అంతా బాగానే ఉంది. కానీ అటు ఐసిసి టోర్నమెంట్లలో మాత్రం విరాట్ కోహ్లీ తడబడుతూ  టీమిండియాకు విజయం అందించడంలో విఫలం అవుతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే.  విరాట్ కోహ్లీ ఇప్పటివరకూ ఎన్నో అద్భుతమైన విజయాలు అందుకున్నప్పటికీ అటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఏ టోర్నీలో కూడా విజయం సాధించలేదు.


 విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగినప్పటికీ చివరికి ఓటమితో అన్నీ సర్దుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించగా ఇక అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తపిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఇటీవల టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పు కుంటున్నాను అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. ఇక ప్రస్తుతం కేవలం ఒక సాదాసీదా ఆటగాడిగా మాత్రమే జట్టులో కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఎంతో మంది మాజీ క్రికెటర్లు స్పందిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.



 ఇక ఇటీవలె టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. కెప్టెన్గా  ఎంత సాధించినప్పటికీ ఐసీసీ కప్పులను గెలవటాన్ని బట్టి విరాట్ కోహ్లీ స్థాయిని అంచనా వేయడం సరికాదు అంటూ మాజీ కోచ్ రావిశాస్త్రి అభిప్రాయం వ్యక్తం చేస్తాడు  భారత్కు ప్రపంచకప్ను అందించిన కెప్టెన్గా ఎంతమంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ ఏకంగా ఆరు ప్రపంచకప్లో ఆడితే కేవలం ఒక్కసారి మాత్రమే టీమిండియా విజయం సాధించింది. ప్రపంచ క్రికెట్ లో భారత దిగ్గజాలు గా చెప్పుకునే రాహుల్ ద్రవిడ్ సౌరవ్ గంగూలి అనిల్ కుంబ్లే ఇలాంటి ఆటగాళ్లు ఆడినప్పటికీప్రపంచ కప్ సాధించలేకపోయారు అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: