భారత క్రికెట్లో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా  గత కొంతకాలం నుంచి మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు టీమిండియాలో అద్భుతంగా రాణించి జట్టుకు విజయాన్ని అందించే హార్దిక్ పాండ్యా అటు పేలవమైన ఫాంతో ఎంతగానో ఇబ్బందులు పడ్డాడు. ముఖ్యంగా టి20 ప్రపంచ కప్ లో భాగంగా హార్దిక్ పాండ్యా పేలవ ఫామ్ టీమిండియాకు ఎంతగానో మైనస్ గా మారిపోయింది. భుజం గాయం కారణంగా బౌలింగ్కు దూరమైపోయిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లో కూడా సరైన ప్రభావం చూపించలేకపోయారు. ఇలా వరుసగా హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఉండడంతో టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత  బిసిసిఐ హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టేసింది.



 ఇకపోతే గత కొంతకాలం నుంచి జట్టుకు దూరమై ఫిట్నెస్ పై దృష్టి పెట్టిన హార్దిక్ పాండ్యా మరికొన్ని రోజుల్లో మళ్లీ జట్టులోకి పునరాగమనం చేయబోతున్నాడు అనేది తెలుస్తుంది. ఇప్పటికే నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు హార్దిక్ పాండ్యా. దీంతో ఇక మరికొన్ని రోజుల్లో టీమిండియా వెళ్లబోయే వెస్టిండీస్  పర్యటనకు హార్దిక్ పాండ్యా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని బిసిసీఐ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఇక హార్దిక్ పాండ్యా జట్టు నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం టీమిండియాలో మిడిలార్డర్ సమస్య ఎంతగానో వేధిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఓపెనర్లు భారీ స్కోర్లు అందించినప్పటికీ అదే జోరు మిడిలార్డర్ బ్యాట్స్మెన్లు మాత్రం కొనసాగించ లేక పోతున్నారు.


 ఈ క్రమంలోనే జట్టులోకి హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ ఇటీవల కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధిస్తే హార్దిక్ పాండ్యా వెస్టిండీస్తో లేదంటే శ్రీలంకతో జరిగే సిరీస్లో పునరాగమనం చేయడం తథ్యం బీసీసీఐ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ఇక మళ్లీ జట్టులోకి పునరాగమనం చేస్తున్న హార్దిక్ పాండ్య బౌలింగ్ బ్యాటింగ్ తో ఎలా రాణించ పోతాడో అని అభిమానులందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: