వ‌చ్చే నెల‌లో స్వ‌దేశంలో వెస్టిండీస్‌తో జ‌రిగే సిరీస్‌కు భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ తిరిగి రానున్నాడు. ముఖ్యంగా సీమ‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, జ‌స్ప్రీత్ బుమ్రాల‌కు విశ్రాంతిని ఇస్తున్న‌ట్టు బీసీసీఐ వెల్ల‌డించింది. వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేలు, మూడు టీ-20ల సిరీస్‌కు సెల‌క్ష‌న్ క‌మిటీ భార‌త జ‌ట్ల‌ను ప్ర‌క‌ట‌న చేసింది. తొడ కండ‌రాల గాయం కార‌ణంగా ద‌క్షిణాప్రికాలో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌కు రోహిత్ దూరం అయ్యాడు. అయితే మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు చోటు ద‌క్క‌లేదు.

గాయం నుంచి కోలుకున్న కెప్టెన్ రోహిత్ శ‌ర్మ జ‌ట్టును ముందుండి న‌డిపించ‌నున్నాడు. రాజ‌స్థాన్ హార్డ్ హిట్ట‌ర్ దీప‌క్ హుడాకు వ‌న్డే పిలుపు వ‌చ్చింది. ద‌క్షిణాఫ్రికాలో స్పిన్న‌ర్లు విఫ‌లం చెంద‌డంతో 21 ఏళ్ల లెగ్ స్పిన్న‌ర్ తొలిసారిగా టీ-20 జ‌ట్టుకు ఎంపిక‌య్యాడు. హార్థిక్ పాండ్య ఇంకా పూర్తిగా ఫిట్‌నెస్ సాధించ‌లేదు అని తెలుస్తోంది. అయితే భార‌త వైస్ కెప్టెన్ కే.ఎల్‌.రాహుల్ రెండ‌వ వ‌న్డే నుంచి అందుబాటులో ఉంటాడు. భువ‌నేశ్వ‌ర్‌కు టీ-20 జ‌ట్టులో మాత్ర‌మే స్థానం ల‌భించినది. స్పిన్న‌ర్ అశ్విన్ ఏ జ‌ట్టులో స్థానం సంపాదించ‌లేదు. ముఖ్యంగా వెస్టిండీస్‌తో వ‌న్డేలు ఫిబ్ర‌వ‌రి 06, 09, 11 తేదీల‌లో అహ్మ‌దాబాద్‌లో జ‌రుగ‌నున్నాయి. అదేవిధంగా టీ-20 మ్యాచ్‌లు ఫిబ్ర‌వ‌రి 16, 18, 20 తేదీల‌లో కోల్‌క‌తాలో జ‌రుగ‌నున్నాయి.

భార‌త వ‌న్డే జ‌ట్టు : రోహిత్ శ‌ర్మ కెప్టెన్‌, కే.ఎల్‌.రాహుల్ (వైస్ కెప్టెన్‌), రుతురాజ్‌, శిఖ‌ర్ ధావ‌న్‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్, శ్రేయాస్ అయ్య‌ర్, దీప‌క్ హుడా, రిష‌బ్ పంత్‌, దీప‌క్ చాహ‌ర్‌, శార్దూల్ ఠాకూర్‌, చాహ‌ల్‌, కుల‌దీప్ యాద‌వ్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, ర‌వి బిష్ణోయ్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ కృష్ణ‌, అవేష్ ఖాన్ ఎంపిక‌య్యారు.

భార‌త టీ-20 జ‌ట్టు :  రోహిత్ శ‌ర్మ, కే.ఎల్‌.రాహుల్, ఇషాన్ కిష‌న్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, రిష‌బ్ పంత్‌, వెంక‌టేష్‌, దీప‌క్ చాహ‌ర్‌, శార్దూర్ ఠాకూర్‌, ర‌వి బిష్ణోయ్‌, అక్ష‌ర్‌ప‌టేల్‌, చాహ‌ల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, భువ‌నేశ్వ‌ర్‌, అవేష్‌ఖాన్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్ టీ-20 జ‌ట్టుకు ఎంపిక అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: