శ్రీలంక దిగ్గజ బౌలర్  లసిత్ మలింగ కు ప్రపంచ క్రికెట్లో ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీలంక క్రికెట్ లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన లసిత్ మలింగ తన బౌలింగ్తో ఎన్నో అద్భుతాలు సృష్టించి జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తనదైనా బౌలింగ్ శైలి తో క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షించాడు.  ఇక విభిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు మలింగ. ఎంతోమంది బ్యాట్స్మెన్లు లసిత్ మలింగ బౌలింగ్ లో ఆడటానికి కాస్త ఇబ్బందులు పడతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఇప్పుడు వరకు ప్రపంచ క్రికెట్లో ఎన్నో రికార్డులు సాధించాడు మలింగ.


 ఇక యార్కర్ల స్పెషలిస్టుగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ సందించే యార్కర్లకు బ్యాట్ మెన్స్ దగ్గర సమాధానం లేకుండా పోతుంది అని చెప్పాలి. అంత అద్భుతంగా యార్కర్ బంతులతో ఇరగదీస్తాడు. ప్రపంచ క్రికెట్లో మాత్రమే కాదు ఐపీఎల్ కూడా ఎన్నోసార్లు అద్భుతాలు సృష్టించాడు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ. ఇకపోతే ఫిట్నెస్ సమస్యల కారణంగా ఎన్నో రోజుల పాటు శ్రీలంక జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన మలింగ .. చివరికి తన కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరూ షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు మళ్లీ లసిత్ మలింగ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఈసారి బౌలర్గా కాదు బౌలింగ్ స్పెషల్ కోచ్గా. ఇటీవలే శ్రీలంక జట్టు బౌలింగ్ స్పెషల్ కోచ్ గా మలింగ ను నియమించినట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జట్టు బౌలింగ్ స్పెషల్ కోచ్ మలింగా ను తాత్కాలిక నియామకం చేపట్టినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. ఇక మైదానంలో వ్యూహాత్మకమైన స్ట్రాటెజీ తో కూడిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయడంలో శ్రీలంక బౌలర్లకు మలింగ సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయని బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా మలింగ మళ్ళీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తుండటం తో అభిమానులు అందరూ ఫుల్ హ్యాపీ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: