భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భారత జట్టుకు మూడు ఐసిసి ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్గా మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతున్నాడు. ఇక తన ఆట తీరుతో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్ గా పేరు సంపాదించుకున్నాడు. ఇక ఎంతో ఒత్తిడిలో కూడా కూల్ గా ఉంటూ కెప్టెన్సీ తో మిస్టర్ కూల్ కెప్టెన్ గా మారిపోయాడు. అటు ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది ధోనిని అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎంతోమంది ధోని గొప్పతనం గురించి అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇకపోతే ఇటీవలే ధోని ప్రతిభ గురించి ఆస్ట్రేలియ మాజీ కెప్టెన్ గ్రెగ్ ఛాపెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రతి జట్టులో కూడా మహేంద్ర సింగ్ ధోనీ లాంటి సహజ సిద్ధమైన ప్రతిభ కలిగిన ఆటగాళ్లు ఉండాలి అంటూ చెప్పుకొచ్చాడు.. ప్రపంచ క్రికెట్లో సహజ వాతావరణంలో ఆట నేర్చుకునే ఆటగాళ్లు ఎక్కువ రోజుల వరకు నిలబడతారు. ధోనీ అలాంటి ఆటగాడే అంటూ చెప్పుకొచ్చారు. కానీ ప్రస్తుత రోజుల్లో మాత్రం ప్రపంచ క్రికెట్లో అలాంటి ఆటగాళ్ల తగ్గిపోతున్నారు. దీంతో అన్ని జట్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని చాపల్ తెలిపాడు.


 అభివృద్ధి చెందిన క్రికెట్ దేశాలు అన్ని కూడా ఇలా సహజసిద్ధమైన ఆటగాళ్లను కోల్పోతున్నాయి.. బాగా ఆడే ఆటగాళ్ల ను చూస్తూ.. కుటుంబసభ్యులు క్రికెటర్లతో సరదాగా గడుపుతూ సహజ సిద్ధంగా ఆట నేర్చుకోవాలి అయితే భారత ఉపఖండంలో మాత్రం ఇంకా ఇలాంటి వాతావరణం కొనసాగుతోంది. ఎన్నో పట్టణాల్లో సౌకర్యాలు తక్కువగా ఉండటం వల్ల వీధుల్లో ఖాళీగా ఉండే పొలాల్లో ఎక్కువగా క్రికెట్ ఆడుతూ ఉంటారు ఇక అక్కడ వారికి కోచింగ్ ఇచ్చే వారు కూడా ఎవరూ ఉండరు. సహజసిద్ధంగానే ఆట నేర్చుకుంటారు. ఒకప్పుడు ధోని కూడా ఇలా సహజసిద్ధంగానే అన్నీ నేర్చుకున్నాడు. ధోని లో ఉండే ప్రతిభ అతని శైలి కోచ్ దగ్గర నేర్చుకున్నవి కాదు తనకు తాను నేర్చుకున్నవి  అంటూ గ్రేగ్ చాపెల్ చెప్పుకొచ్చాడు. నాకు తెలిసిన అత్యంత చురుకైన బుర్రలలో ధోనిది కూడా ఒకటి అంటూ చెప్పుకొచ్చాడు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: