ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ బయో బబుల్ కఠిన నిబంధనల మధ్య నిర్వహిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బయో బబుల్ కారణంగా ఆటగాళ్ళు ఒత్తిడిలో మునిగిపోకుండా ఉండేందుకు ఆటగాళ్లకు ఎంటర్టైన్మెంట్ పంచేందుకు యాజమాన్యం అప్పుడప్పుడు వివిధ రకాల ఫన్నీ కార్యక్రమాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ హిట్టర్ రోవ్మన్ పావెల్ కూడా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.


 మొదట్లో ఎంతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ ఏడాది పడుతూనే ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అనే విషయం తెలిసిందే  ఇప్పటివరకు పదకొండు మ్యాచులు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం ఐదు విజయాలు మాత్రమే సాధించింది. ఇక 6 ఓటములతో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతు ఉండటం గమనార్హం. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తర్వాత మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఈ మూడు మ్యాచ్ లలో గెలిస్తే ప్లేఆఫ్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాజస్థాన్ రాయల్స్ తలబడపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్. కాగా ఇటీవలే ఢిల్లీ హిట్టర్ పావెల్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ముంబైలో అడుగుపెట్టినప్పుడు తనకు ఒక వింత అనుభవం ఎదురైంది అంటూ చెప్పుకొచ్చాడు. ఎయిర్ పోర్టులో దిగినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ తప్ప మరెలాంటి బట్టలు లేవు. అవి ఎక్కడో మిస్ అయి పోయాయి.  ఆ తర్వాత హోటల్ రూమ్ లో మూడు రోజుల పాటు టవల్ చుట్టుకుని గడిపాను అంటూ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు పావెల్. ఇక ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు అంటు తనలో తాను నవ్వుకున్నాడు. ఇక ఐపీఎల్ కోసం కరేబియన్ నుంచి ఇండియాకు వచ్చానని ఢిల్లీ క్యాపిటల్ ఫ్రాంచైజీ  ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు   చెప్పుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఉంటే సొంత జట్టులో ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ మంచి ఆటగాడు మాత్రమే కాదు గుడ్ కెప్టెన్ అంటూ తెలిపాడు పావెల్..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl