ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎవరు కలలో కూడా ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. గత రెండు మూడు మ్యాచ్ ల నుంచి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచాడు. భుజం గాయం కారణంగా బౌలింగ్ కి  దూరం అయిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ట్రైనింగ్ తీసుకుని గాయం నుంచి కోలుకునీ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అయితే మళ్లీ పునరాగమనం చేసిన రాణించడం కష్టం అని అనుకున్నారు. అలాంటి సమయంలోనే గుజరాత్ జట్టు కెప్టెన్సి చేపట్టే అవకాశం కూడా వచ్చింది. ఇక కెప్టెన్సీలో ఎలాంటి అనుభవం లేని హార్దిక్ పాండ్యా జట్టును ముందుకు నడిపించడం అసాధ్యమని అనుకున్నారు.


 మరిముఖ్యంగా ఐపీఎల్లో ఛాంపియన్ జట్లుగా కొనసాగుతున్న చెన్నై ముంబై జట్టును ఓడించి గుజరాత్ జట్టు విజయాలు సాధించడం మరింత కష్టం అని భావించారు.  కానీ ఎవరు ఊహకందని విధంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఒక ఆటగాడిగా సక్సెస్ అయ్యాడు. గుజరాత్ జట్టుకు మొదటి నుంచి వరుస విజయాలు అందిస్తూ ముందుకు నడిపించాడు. ఎప్పుడూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాడు. 9 మ్యాచ్ లలో 8 విజయాలు సాధించి చరిత్ర సృష్టించిన గుజరాత్ తరువాత రెండు మ్యాచ్ లలో ఓడి పోయింది. ఇక ఇటీవలే లక్నో తో జరిగిన మ్యాచ్ లో మరోసారి అద్భుతమైన విజయాన్ని సాధించింది.


 దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కి చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది అని చెప్పాలి. తొలి  సీజన్లోనే దిగ్గజ టీమ్ లను వెనక్కి నెట్టి అన్ని జట్ల కంటే ముందు  ప్లే ఆఫ్ బెర్త్ పై కర్చీఫ్ వేసింది. ఇటీవలే లక్నోతో జరిగిన మ్యాచ్ లో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది గుజరాత్ జట్టు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో లక్నో బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. 13.5 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌటైంది. కేవలం ముగ్గురు తప్ప మిగతా అందరూ కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్ లో అడుగుపెట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి: