ఇటీవలే టేబుల్ టాపర్ గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. టేబుల్ టాపర్ గా ఉన్న ఈ రెండు జట్ల లో ఎవరు పైచేయి సాధిస్తారో అని అటు ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయి మరి ఈ మ్యాచ్ వీక్షించారు. ఈ క్రమంలోనే లక్నో జట్టుపై గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక గుజరాత్ టైటాన్స్ విజయంలో ఓపెనర్ శుబ్ మన్ గిల్ కీలకమైన పాత్ర వహించాడు. 49 బంతుల్లో 63 పరుగులు చేసి అదరగొట్టాడు. ఓపెనర్ గా వచ్చిన శుబ్ మన్ గిల్ 20 ఓవర్ల వరకు  క్రీజులో ఉన్నాడు అని చెప్పాలి.


 ఒకవైపు బ్యాట్స్మెన్లు వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ ఎక్కడా తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా జట్టు కోసం అద్భుతమైన పోరాటాన్ని సాగించాడు. అయితే ఇలా ఓపెనర్గా వచ్చి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి నాటౌట్గా  క్రీజ్లో ఉండడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే అప్పుడు టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పై ఓపెనర్గా బరిలోకి దిగి ఇక ఈ అరుదైన రికార్డును సాధించాడు. 49 బంతుల్లో 7 ఫోర్లు సహాయంతో 59 పరుగులు చేసి 20 ఓవర్ల వరకు ఆడిన సచిన్ టెండూల్కర్ చివరికి నాటౌట్ గా నిలిచాడు.


 అంతేకాదండోయ్ ఇటీవలే గుజరాత్ టైటాన్స్ జట్టులో చివరివరకు ఆడిన శుబ్ మన్ గిల్ కి ఇక అప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున ఓపెనర్గా ఆడిన సచిన్ టెండూల్కర్ కూడా తమ ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్ కూడా కొట్టక పోవడం గమనార్హం. 2009 సీజన్ లో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై 19 పరుగుల తేడాతో విజయం సాధించింది ముంబై ఇండియన్స్.  ఇక ఇప్పుడు లక్నోపై 62 పరుగులు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఇక నిన్నటి మ్యాచ్ లో భాగంగా 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సాధించలేకపోయింది లక్నో. 82 పరుగులకే కుప్పకూలింది చేతులెత్తేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: