భారత జట్టులో 3 ఫార్మాట్లలో కూడా కీలకమైన ఆల్రౌండర్గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కొనసాగుతున్న విషయం తెలిసిందే  చెన్నై జట్టులో ఎన్ని ఏళ్ళ నుంచి విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఒకవైపుబౌలర్ గా మరోవైపు బ్యాటింగ్ లో కూడా హాజరు అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో కీలక నేతగా ఎదిగిన రవీంద్ర జడేజాను ఇటీవల ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కెప్టెన్గా చేస్తూ నిర్ణయం తీసుకుంది.


 కానీ జట్టు ను సమర్ధవంతంగా ముందుకు నడిపించలేకపోయిన జడేజా కొన్నిరోజుల క్రితమే  కెప్టెన్సీ నుంచి తప్పకుంటున్న అంటు ప్రకటించి  మహేంద్ర సింగ్ ధోనీకి సారధ్య బాధ్యతలు అప్పగించాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా  జట్టులో కనిపించలేదు. దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ అయ్యారు. జడేజా లాంటి ఆటగాడిని ఎందుకు జట్టు నుండి పక్కన పెట్టారు అంటూ షాక్ లో మునిగిపోయారు. అయితే ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఆడని రవీంద్ర జడేజా ఇక ఐపీఎల్ సీజన్ మొత్తానికి కూడా దూరమయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది.


 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రవీంద్ర జడేజా పై గాయాలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో అతను ఆడలేదు అనేది తెలుస్తుంది. ఇక గాయం తీవ్రత తగ్గకపోగా మరింత రెట్టింపు కావడంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆడబోయే మిగతా మ్యాచ్లకు కూడా రవీంద్ర జడేజా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కి ప్లే ఆఫ్ అవకాశాలు ఎంతో క్లిష్టంగా మారిపోయాయ్ అని చెప్పాలి.  11 మ్యాచ్ లలో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: