ఈ ఏడాది భారీ ధర పలికిన ఎంతో మంది ఆటగాళ్లు అంచనాలకు తగ్గట్లుగా రాణించలేకపోయారు అనే విషయం తెలిసిందే. తక్కువ ధరతో ఐపీఎల్లో అడుగుపెట్టిన యువ ఆటగాళ్లు అదరగొడితే.. భారీ ధర దక్కించుకున్న ప్లేయర్స్ మాత్రం ఎందుకొ పెద్దగా ఆకట్టుకోలేకపోయారూ. ఇక అలాంటి ఆటగాళ్లలో అటు ముంబై ఇండియన్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ కూడా ఒకరూ.  మెగా వేలంలో అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ముంబై ఇండియన్స్ జట్టు 15.75 కోట్లు వెచ్చించి మరీ అతని దక్కించుకుంది. ఇంత భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తే 11 ఇన్నింగ్స్ లో అతను చేసింది 321 పరుగుల మాత్రమే కావడం గమనార్హం.



 దీంతో అతని ఆటతీరు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ కోసం 15 కోట్లకు పైగా ఖర్చు చేసి తప్పు చేసింది అంటూ ఎంతో మంది అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇటీవల తనకు మెగా వేలంలో భారీ ధర పలకడం గురించి ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వేలంలో దక్కిన ధర గురించి ఆటగాడి పై రెండు రోజులు మాత్రమే ఒత్తిడి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. కానీ జట్టు విజయాలకు సహకరించడం ఆటతీరు మెరుగుపరచుకోవడం పై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం అంటూ తెలిపాడు ఇషాన్ కిషన్.


 డ్రెస్సింగ్ రూమ్ లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం.. విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా ఆటగాళ్లతో మాట్లాడటం వల్ల మెగా వేలంలో ఎక్కువ ధర పలకడం  విషయంలో ఒత్తిడి అధిగమించగలిగాను అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే మెగా వేలంలో ధర గురించి కాకుండా నా జట్టు గెలవడానికి ఏ విధంగా సహాయ పడాలి అనే విషయంపైనే దృష్టి పెట్టాను. ఒకవేళ ధర విషయంలో ఒత్తిడి ఉన్నప్పుడు సీనియర్లతో మాట్లాడటం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా కూడా.. ధర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ నాతో చెప్పారు అటు గుర్తుచేసుకున్నాడు ఇషాన్ కిషన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl