ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయ్.  సరిగ్గా ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్రసింగ్ ధోని.. రవీంద్ర జడేజాను కెప్టెన్గా చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత రవీంద్ర జడేజా కెప్టెన్సీ సామర్ధ్యాన్ని నిరూపించుకోలేక పోవడం చెన్నై జట్టు వరుస పరాజయాలతో సతమతమవ్వటం జరిగింది. ఇక ఆ తర్వాత కెప్టెన్సీ నావల్ల కాదంటూ మళ్లీ ధోని ఇచ్చేసాడు రవీంద్ర జడేజా. ఈ క్రమంలోనే జడేజాకు కెప్టెన్సీ అప్పగించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడూ మాజీ ఆటగాళ్లు.


 ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై జట్టు కెప్టెన్సి ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకూ అప్పగిస్తున్నట్లు సీఎస్కే యాజమాన్యం నిర్ణయం తీసుకోవడంతో అతని పరిస్థితి నీటిలో నుంచి బయటపడిన చాపల తయారయింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. సహజంగా సారథ్య బాధ్యతలు చేపట్టే సామర్థ్యం అటు రవీంద్ర జడేజాకు అసలు లేదు. ఎందుకంటే ఇప్పటివరకూ ఎప్పుడు కూడా కెప్టెన్సీ నిర్వహించలేదు. దీంతో ఒక్కసారిగా చెన్నై జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడంతో అతనికి ఎంతో కష్టంగా అనిపించింది.


 ఇక మొదటి మ్యాచ్ నుంచి రవీంద్ర జడేజా కెప్టెన్సినీ అభిమానులు జడ్జ్ చేయడం మొదలుపెట్టారు. ఇందులో అతని తప్పేమీ లేదు. జడేజ పరిస్థితి చేపల తయారైంది. నీటిలో ఉండే చేప ప్రశాంతంగా ఉంటుంది. అయితే బయటకు వచ్చినప్పుడు విలవిలలాడిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరకొడుతున్న జడేజాకు కెప్టెన్సీ రావడం కారణంగా ఒత్తిడితో తన ప్రదర్శన పై కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా తన ఆట మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటూ టీమిండియా మాజీ కోచ్ రావిశాస్త్రి చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: