గత ఏడాది ఐపీఎల్ సీజన్ వరకు సన్రైజర్స్ హైదరాబాదులో కొనసాగిన డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జట్టు మారిన వార్నర్ దూకుడైన ఆట తీరు లో  మాత్రం మార్పు రాలేదు అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ లో కూడా అద్భుతంగా రాణిస్తూ సూపర్ ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు డేవిడ్ వార్నర్. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కాస్త లేట్ గా జాయిన్ అయిన ప్పటికీ హాఫ్ సెంచరీలతో అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా మరోసారి డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో అదరగొట్టడం గమనార్హం. మిచెల్ మార్ష్ తో కలిసి కీలకమైన హాఫ్ సెంచరీ చేసిన డేవిడ్ వార్నర్ ఢిల్లీ జట్టును గెలిపించాడు. ప్లే ఆఫ్ అవకాశాలను  అవకాశాలను సజీవంగా ఉంచాడు. ఈక్రమంలోనే డేవిడ్ వార్నర్ ఒక అరుదైన రికార్డు సాధించాడు అని చెప్పాలి. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు 400 పరుగుల మార్కును అందుకున్న క్రికెటర్ల జాబితాలో డేవిడ్ వార్నర్ చేరిపోయాడు.


 ఈ క్రమం లోనే శిఖర్ ధావన్,విరాట్ కోహ్లిల సరసన నిలిచాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ ఎనిమిదిసార్లు 400 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇక అదే సమయంలో విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్  లు కూడా ఐపీఎల్ లో ఎనిమిది సార్లు ఈ మార్క్ ను చేరుకోవడం గమనార్హం. ఇక ఈ రికార్డు లిస్టు లో సురేష్ రైనా తొలి స్థానంలో ఉన్నారు. సురేష్ రైనా 9సార్లు ఐపీఎల్ లో 400 మార్క్ అందుకున్నాడు. కాగా ఇలా వరుసగా అద్భుతంగా రాణిస్తూ డేవిడ్ వార్నర్ రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl