ఈ రోజు ముంబైలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో భాగంగా చెన్నై మరియు ముంబై జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఇప్పటికే ఐపిఎల్ ప్లే ఆప్స్ కు దూరమైన ముంబై ఇండియన్స్... ఇప్పుడు ఈ లీగ్ నుండి కనీసం మంచి స్థానం నుండి అయినా ముగించాలి అని తహతహలాడుతోంది. అందులో భాగంగా ఇక ముంబై ఆడే అన్ని మ్యాచ్ లను గెలవాలని 100 శాతం ఎఫర్ట్ పెట్టింది. ఇక ప్లే అఫ్స్ రేస్ లో నిలవాలంటే గెలవాలి అన్న పరిస్థితిలో చెన్నై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది. అయితే మొదటి ఓవర్ లోనే ముంబై పేసర్ సామ్స్ భీకరమైన ఫామ్ లో ఉన్న కాన్ వే మరియు మూన్ అలీ వికెట్ లను తీసుకుని కోలుకోలేని దెబ్బ తీశాడు.

అప్పటి నుండి చెన్నై కోలుకోలేకపోయింది.. కానీ కెప్టెన్ ధోని 36 పరుగుల పుణ్యమా అని చివరికి 97 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. ముంబై బౌలర్లలో శామ్స్ 3, మెరెడిత్ 2 మరియు కుమార్ కార్తికేయ 2 వికెట్లు దక్కించుకున్నారు. అయితే చేధనలో ముంబై కూడా ఒక దశలో తడబడింది. కేవలం 33 పరుగులకు ముంబై ప్రధాన బ్యాట్స్మన్ అందరూ ఔట్ అయ్యారు. ఈ దశలో యువ ఆటగాడు తిలక్ వర్మ కాసేపు షోకీన్ మరియు టీమ్ డేవిడ్ లతో కలిసి ముంబైను విజయ తీరాలకు చేర్చాడు. ముంబై 14.5 ఓవర్ లలో  లక్ష్యాన్ని ఛేదించి చెన్నై ను లీగ్ నుండి ఔట్ అయ్యేలా చేసింది.

ఈ ఓటమితో చెన్నై 12 మ్యాచ్ లలో 4 గెలిచి 8 ఓడిపోయింది. కాబట్టి ఇక ఎటువంటి పరిస్థితులలో చెన్నై కు ప్లే ఆఫ్ రేస్ కు ఎటువంటి సంబంధం లేదు. ముంబై పోతూ పోతూ తమతో పాటు చెన్నై ను తీసుకెళుతుంది. ఇంకా ప్లే ఆఫ్ రేస్ లో 7 జట్లు ఉన్నాయి. ఇక మ్యాచ్ లో జరిగే కొద్దీ మిగిలిన జట్లపై ఒక  క్లారిటీ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: