ఈ ఏడాది ముంబై ఇండియన్స్ జట్టు ఎంత పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా వేలం కారణంగా జట్టు లో ఉన్న కీలక ఆటగాళ్లు బయటికి వెళ్లిపోవడంతో ఇక ముంబై ఇండియన్స్ లో సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ  ఆటగాళ్లతో జట్టును సమర్థవంతంగా ముందుకు నడిపించలేకపోయాడు. చివరికి ఇక పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివర కొనసాగింది ముంబై ఇండియన్స్ జట్టు.


 ఈ క్రమంలోనే తీవ్రస్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొంది అన్న విషయం తెలిసిందే. ఇది ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇక ఈ ఏడాది ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడాన్ని అటు అభిమానులు అసలు జీర్ణించుకోలేకపోయారు. అయితే ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకు పోయిన తర్వాత ముంబై ఇండియన్స్ పుంజుకుంది. వరుసగా విజయాలు సాధిస్తోంది. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్  తో జరిగిన మ్యాచ్ లో ఓ అద్భుతమైన విజయాన్ని సాధించింది.


 ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. దీంతో అతికష్టం మీద 98 పరుగులు చేయగలిగారు. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్ జట్టు  34 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. దీంతో కష్టాల్లో పడిపోయింది. అయినప్పటికీ మళ్లీ పుంజుకుని 14.5 ఓవర్లలోనే 98 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇక ఈ విజయం చూసిన తర్వాత మొదటి నుంచి ముంబై ఇలా రాణించి ఉంటే బాగుండేదని అభిమానులు కోరుకుంటున్నారు. చెన్నై సూపర్సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ పటిష్టంగా కనిపించినట్లు గానె ఇక మిగతా జట్లపై కూడా బాగా రాణించిఉంటే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టేది అని భావిస్తూ ఉన్నారు. అయినా ఇప్పుడు ఎంత ఆలోచించినా ఏం లాభం.. ఇక ముంబై ఇండియన్స్ తో పాటు ఇటీవల ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఇంటి బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl