సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అందుకే వారికి సంబంధించి ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక క్రికెటర్ కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. క్రికెటర్ పై చీటింగ్ కేసు నమోదు కావడం సంచలనం గా మారిపోయింది. చత్తీస్గడ్ రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న హర్మ్ ప్రీత్ సింగ్ బాటీయా పై రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. నకిలీ ధ్రువపత్రాల తో అతను అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రయత్నించడంతో ఆరోపణలతో అతనిపై ఇక చీటింగ్ కేసు నమోదు కావడం గమనార్హం.


 రాష్ట్రంలోని బాలొద్ జిల్లాకు చెందిన హర్మ్ ప్రీత్ సింగ్ బాటీయా ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్గా ఉద్యోగం చేస్తున్నారు. 2014లో ఆ ప్రదర్శనకు ఆకట్టుకుని రంజీ జట్టులో రాణించటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు డిగ్రీ పట్టా ఉందని అందుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించాడు. అటు ప్రభుత్వ అధికారులు మాత్రం వారు సమర్పించిన డిగ్రీల పై అనుమానాలు రాగా ఇక అతని సర్టిఫికెట్ పై ఉన్న యూనివర్సిటీ సంప్రదించగా అసలు విషయం బయటపడింది. హర్మ్ ప్రీత్ సింగ్ బాటీయా సదరు యూనివర్సిటీ లో అసలు చదవలేదు అనే విషయం తేలింది.


 ఈ క్రమంలోనే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇక సదరు క్రికెటర్ పై ఐపీసీ చీటింగ్ ఫోర్జరీ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడం గమనార్హం. విచారణ పూర్తయిన తర్వాత ఒకవేళ నేరం రుజువైతే మాత్రం అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే కాదు జైలుకు కూడా వెళ్లాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. కాగా 2010లో అండర్-19 ప్రపంచ కప్ లో ఆడిన హర్మ్ ప్రీత్ సింగ్ బాటీయా కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో కూడా ఆడాడు. 2011లో పూణే వారియర్స్ 2017లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. కానీ తనని తాను నిరూపించుకునేందుకు అవకాశాలు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: