ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రస్తుతం ప్రతి మ్యాచ్ కూడా ఎంతో రసవత్తరంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. లీగ్ మ్యాచ్ లు ముగింపు దశకు రావడంతో ప్రస్తుతం ప్రతి ఒక్క జట్టు ప్లేఆఫ్ లో అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా హోరాహోరీగా ప్రత్యర్థులతో తడబడుతోంది. అయితే ఇటీవలే లక్నో గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో విజయఢంకా మోగించిన గుజరాత్ జట్టు ఇక ఈ ఏడాది ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది అనే చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇక మిగతా మూడు స్థానాల కోసం అన్ని జట్లు పోటీ పడుతూ ఉన్నాయి. కాగా ఇప్పటికే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపిఎల్ నుంచి నిష్క్రమించాయ్. దీంతో ప్రతీ మ్యాచ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోతుంది. ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మ్యాచ్ వీక్షిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ రోజు మరో ఆసక్తికర పోరు జరగబోతుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్  మధ్య మ్యాచ్ జరిగనుంది. ఇటీవలే పంజాబ్ కింగ్స్  జట్టు అద్భుత విజయాన్ని సాధించి మళ్లీ పుంజుకుంది అని చెప్పాలి. అదే సమయంలో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఎంతో పటిష్టంగా కన్పిస్తోందని అన్న విషయం తెలిసిందే.


 కాగా ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్  తో జరిగిన మ్యాచ్ లో గెలిచింది అంటే ఇకపై ప్లే ఆఫ్ అవకాశాలు  మరింత ఈజీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ జట్టు పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ప్లే అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక మ్యాచ్ గెలవాల్సి ఉంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పైచేయి సాధించే జట్టు ఏది అని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl