ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు మాత్రమే కాదు సీనియర్లు కూడా రికార్డుల మోత మోగిస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక మ్యాచ్లో ఒక రికార్డు సాధించడం కామన్. కానీ కొంత మంది ఆటగాళ్లు మాత్రం ఒకే మ్యాచ్లో 2, 3 రికార్డులను ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కోల్కత నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రూ రస్సెల్ కూడా ఇలాంటి రికార్డ్ సాధించాడు అనే చెప్పాలి. ఇటీవల కోల్కత నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ రెండు జట్లు కూడా తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. దీంతో ఎవరు పైచేయి సాధిస్తారో అని అందరూ కూడా ఎంతో ఆసక్తిగా మ్యాచ్ వీక్షించారు.


 అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ జట్టు అతికష్టం మీద 173 పరుగులు చేయగలిగింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ ముందు ఒక మోస్తరు టార్గెట్ మాత్రమే ఉండడంతో ఎంతో అలవోకగా ఛేదించడం ఖాయం అని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ విభాగం మొత్తం చేతులెత్తేసింది. దీంతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.



 అయితే సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఆండ్రీ రస్సేల్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఈ క్రమంలోనే  మూడు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో 2000 పరుగుల మార్కును దాటిన రస్సెల్ అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా కోల్కతా నైట్ రైడర్స్ తరఫున రెండు వేల పరుగులు పూర్తి చేసిన నాలుగవ ఆటగాడిగా ఘనత సాధించాడు. ఇక ఒక ఐపీఎల్లో 250 కంటే ఎక్కువ పరుగులు 10 వికెట్లు అత్యధిక సార్లు సాధించిన ప్లేయర్ గా కూడా ఆండ్రూ రస్సెల్ అరుదైన రికార్డు సాధించాడు అని చెప్పాలి. ఇప్పటి వరకు ఈ ఫీట్ నాలుగు సార్లు సాధించాడు ఆండ్రూ రస్సెల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl