ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి అనే విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకీ గుడ్ బై చెప్పి జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ఈ క్రమంలోనే జడేజా కెప్టెన్గా సక్సెస్ కాలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. జడేజా కెప్టెన్సీలో  చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్ లలో వరసగా ఓటమి పాలయింది. ఈ క్రమంలోనే జడేజా  కెప్టెన్సీపై ఎంతో మంది విమర్శలు చేశారు.


 చెన్నై యాజమాన్యం రవీంద్ర జడేజాకు కెప్టెన్సి ఇచ్చి తప్పు చేసింది అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రవీంద్ర జడేజా ధోనీకి మళ్లీ కెప్టెన్ ఇచ్చేశాడు. ఇక ధోనీ కెప్టెన్సీ వచ్చిన తర్వాత చెన్నై వరుస విజయాలు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. ధోని కెప్టెన్సీ చేపట్టిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగు మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో విజయం సాధించింది. మూడు మ్యాచ్ లలో కూడా ఘోర పరాభవాన్ని చవిచూసింది. దీంతో జడేజా అభిమానులు మాత్రం ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


 మొన్నటి వరకు రవీంద్ర జడేజా కెప్టెన్సీకి అనర్హుడు కెప్టెన్సీ సాధ్యం కాదు అంటూ విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు ధోనీ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత జరిగింది ఏమిటి జట్టులో ఆటగాళ్ళ సంఖ్య ఆడినప్పుడు ఎవరు కెప్టెన్సీ చేస్తే ఏంటి.. ఇప్పుడు ధోని కెప్టెన్సీలో కూడా నాలుగు మ్యాచ్ లలో మూడింట్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. దీనికి ఏం సమాధానం చెబుతారు అంటూ రవీంద్ర జడేజా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవలే గుజరాత్ చేతిలో చెన్నై చిత్తుగా ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేస్తే స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన  గుజరాత్ ఆకరి ఓవర్లో 3 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: