క్రికెట్ ఆస్ట్రేలియా ప్రస్తుతం పూర్తిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా ఇద్దరు దిగ్గజ క్రికెటర్ లను కోల్పోయింది క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో అభిమానులు అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ ఏడాది మార్చి 4వ తేదీన క్రికెట్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గుండెపోటుతో మరణించాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవలే మరో దిగ్గజ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్ కూడా అకస్మాత్తుగా ఏకంగా రోడ్డు ప్రమాదం బారిన పడి చనిపోయాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు దిగ్గజ క్రికెటర్లూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం  అందరూ షాక్ లో మునిగిపోయారు. ఇద్దరు కూడా ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని విజయాలను అందించారు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టును పటిష్ఠంగా మార్చడంలో కీలకపాత్ర వహించారు అని చెప్పాలి. అయితే వివాదాల విషయంలో కూడా ఇద్దరు క్రికెటర్లు  పలుమార్లు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు అని చెప్పాలి.


 ఇక ఇటీవలే ఆండ్రూ సైమండ్స్ మరణవార్త తెలియగానే వీరిద్దరికీ సంబంధించిన ఒక వివాదం ప్రస్తుతం తెర మీదికి వచ్చి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. 2021 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 2వ టెస్ట్ సందర్భంగా షేన్ వార్న్ ఆండ్రూ సైమండ్స్ ఇద్దరూ కూడా మోడ్రాన్ స్మిత్ గా పిలవబడే ఆస్ట్రేలియా క్రికెటర్  లబుషేన్ పై అసభ్య పదజాలంతో విరుచుకుపడటం అందరినీ షాక్ కి గురి చేసింది. 33 ఇద్దరి  సంభాషణ స్పాక్ స్పోర్ట్స్ లైవ్ లో ప్రసారం చేయడంతో ఇక అసలు విషయం బయటపడింది. లుబుషేన్ 91 పరుగుల వద్ద ఔట్ కావడంతో షేన్ వార్న్  విమర్శించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అందుకున్న సైమండ్స్ కూడా బూతులు మాట్లాడటం గమనార్హం.


 ఇక వీరు మాట్లాడిన బూతులు మొత్తం ప్రత్యక్ష ప్రసారం కావడంతో తీవ్ర స్థాయిలో విమర్శల పాలు అయ్యారు అని చెప్పాలి. అయితే ఈ క్రికెటర్ బూతులు తిట్టిన దిగ్గజాలు  కేవలం రెండు నెలల వ్యవధిలోనే హఠాత్ మరణం చెందడం తో ఇక ప్రస్తుతం లబుషేన్ విషయం కాస్త నెట్టింట్లో ట్రెండింగ్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఈ దిగ్గజ క్రికెటర్ హఠాత్ మరణం చెందడం పై కూడా ఎంతోమంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఆకతాయిలు మాత్రం పాత వివాదాన్ని గుర్తుచేస్తూ చిత్రవిచిత్రమైన పోస్టులు పెడుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl